AP కేబినెట్‌ కీలక నిర్ణయాలు..

AP-CABINET

సాక్షి, అమరావతి: పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నిజం
చేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్సార్‌ జగనన్న
హౌసింగ్‌ ప్రాజెక్టు కింద వారికి అందుబాటు ధరలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చే కార్యక్రమం
కోసం, ప్రైవేటు లే అవుట్లలోని  5 శాతం స్ధలాన్ని కలెక్టర్లకు అప్పగించాలని
నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ప్రైవేటు లే అవుట్‌లో ఈ మేరకు భూ లభ్యత లేకపోతే 3
కిలోమీటర్ల దూరం లోపల కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ల్యాండ్‌ బ్యాంకును
హౌసింగ్‌ ప్రాజెక్టు కింద వినియోగించుకోవాలని నిశ్చయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్‌ భేటీలో మంత్రి
మండలి నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు నవరత్నాల అమలుకు కేలెండర్‌ రూపకల్పన, వసతి
దీవెన, రైతు భరోసా, ఆంధ్రప్రదేశ్‌ గేమింగ్‌ యాక్టు –1974 సవరణ తదితర అంశాలకు
కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఏపీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు

►2021–22 సంవత్సరానికి సంబంధించి నవరత్నాల అమలు కేలెండర్‌కు కేబినెట్‌ ఆమోదం

– ఏప్రిల్‌లో వసతి దీవెన, సుమారు 15 లక్షల 56 వేల 956 మందికి లబ్ధి

– ఏప్రిల్, జూలై, డిసెంబరు, పిబ్రవరి–2022 జగనన్న విద్యా దీవెన (సంపూర్ణ ఫీజు
రీయింబర్స్‌మెంట్‌) అమలు. దాదాపు 18 లక్షల 80 వేల 934 మందికి లబ్ధి

–జూన్‌లో జగనన్న విద్యా కానుక, దాదాపు 42 లక్షల 34 వేల 322 మందికి లబ్ధి

–ఏప్రిల్‌లో రైతులకు వడ్డీలేని రుణాలు (రబీ 2019, ఖరీప్‌ 2020కు సంబంధించి)
దాదాపు 66 లక్షల 11 వేల 382 మందికి లబ్ధి

–ఏప్రిల్‌లో డ్వాక్రా అక్కచెల్లమ్మలకు వడ్డీలేని రుణాలు, దాదాపు 90 లక్షల 37 వేలు
255 మందికి లబ్ధి

–మేలో 2020 ఖరీఫ్‌కు సంబంధించి పంటల బీమా చెల్లింపు, దాదాపు 9 లక్షల 48వేల మందికి
లబ్ధి

–మే, అక్టోబరు, జనవరి 2022లలో మూడు దఫాలుగా రైతుభరోసా, దాదాపు 54 లక్షల 300
మందికి లబ్ధి

–మేలో మత్స్యకార భరోసా, దాదాపు 1 లక్షా 9 వేల 231 కుటుంబాలకు లబ్ధి

–మే నెలలో మత్స్యకార భరోసా కింద డీజిల్‌ సబ్సిడీ చెల్లింపు, దాదాపు 19 వేల 746
మందికి లబ్ధి

Flash...   Bank Charges: కస్టమర్స్ నుంచి బ్యాంకులు ఎన్ని రకాల ఛార్జీలు వసూలు చేస్తాయో తెలుసా..?

–జూన్‌లో వైయస్సార్‌ చేయూత కింద దాదాపు 24 లక్షల 55 వేల 534 మందికి లబ్ధి

–జూలైలో వైయస్సార్‌ వాహనమిత్ర పథకం కింద దాదాపు 2 లక్షల 74వేల 15 మందికి లబ్ధి

–జూలైలో కాపునేస్తం పథకం కింద దాదాపు 3 లక్షల  27 వేల 862 మందికి లబ్ధి

–ఆగష్టులో రైతులకు వడ్డీలేని రుణాలు (ఖరీప్‌ 2021కు సంబంధించి) దాదాపు 25 లక్షల
మందికి లబ్ధి

–ఆగష్టులో ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్‌మిల్లులకు ఇండస్ట్రియల్‌ ఇన్సెంటివ్‌లు
చెల్లింపు, దాదాపు 9 వేల 800 మందికి లబ్ధి

–ఆగష్టులో నేతన్ననేస్తం పథకం కింద దాదాపు 81 వేల 703 మందికి లబ్ధి

–ఆగష్టులో అగ్రిగోల్డ్‌ బాధితులకు నగదు చెల్లింపులు, దాదాపు 3 లక్షల 34 వేల 160
మందికి లబ్ధి

–సెప్టెంబరులో వైయస్సార్‌ ఆసరా కింద దాదాపు 87 లక్షల 74 వేల 674 మందికి లబ్ధి

–అక్టోబరులో జగనన్న తోడు పథకం కింద దాదాపు 9 లక్షల 5 వేల ముగ్గురికి లబ్ధి

–అక్టోబరులో టైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులుకు జగనన్న చేదోడు కింద దాదాపు 2
లక్షల 98 వేల 428 మందికి లబ్ధి

–నవంబరులో ఆర్దికంగా వెనుకబడిన మహిళలకు ఈబీసీ నేస్తం పథకం, దీనికింద  దాదాపు
6 లక్షలమందికి లబ్ధి.

–జనవరి, 2022 అమ్మఒడి అమలు, దీనికింద దాదాపు 44 లక్షల 48 వేల 865 మందికి లబ్ధి. ఈ
పథకాలతో మొత్తంగా 5 కోట్ల 8 లక్షల 8 వేల 220 మందికి లబ్ధి చేకూరనుంది. నెలవారీ
ఇచ్చే పెన్షన్లతో కలిపి 5,69,81,184 ప్రయోజనాలు కలుగనున్నాయి.

-వైఎస్సార్‌ లా నేస్తం కింద దాదాపు 2012 మందికి ప్రతినెలా లబ్ధి

-జగనన్న గోరుముద్దద్వారా 36లక్షల, 88వేల 618 మందికి లబ్ధి

– వైఎస్సార్‌ సంపూర్ణ పోషణద్వారా 30,16,000 మందికి లబ్ధి

-ఇమామ్‌, మౌజామ్‌లకు ఆర్ధిక సాయం ద్వారా 77,290 మందికి లబ్ధి

–ఇంకా మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లపట్టాల పంపిణీ

-వీరితో పాటు నెలవారీ ఇంటింటికి రేషన్ అందుకుంటున్న లబ్ధిదారులు

ఆర్ధికంగా వెనుకబడ్డ అగ్రకులాలకు చెందిన మహిళలకు జగనన్న వరం

ఆర్ధికంగా వెనుకబడ్డ వర్గాలకు ఈబీసీ నేస్తం కింద ఏడాదికి రూ.15వేల చొప్పున
మూడేళ్ల పాటు రూ.45 వేలు ఇవ్వనున్నారు. 45 నుంచి 60 ఏళ్ల లోపున్న మహిళలకు ఈ పథకం
వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇప్పటికే చేయూత, కాపులకు
కాపు నేస్తం పథకం అమలు చేస్తున్నారు. అదే తరహాలో ఆర్ధికంగా వెనుకబడ్డ ఉన్నత
కులాల్లోని మహిళలకు ఈబీసీ నేస్తం వర్తింపజేయనున్నారు.

Flash...   VACCINE OFFER : వ్యాక్సిన్ తీసుకుంటే బీరు… 200 డాలర్ల నగదు ఫ్రీ…

ఒకే ఒక్క రూపాయితో

300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్ల కోసం పేదల వద్ద నుంచి గత ప్రభుత్వం వసూలు చేసిన
డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 1 లక్షా 43 వేల
600 మందికి ఒకే ఒక్క రూపాయితో ఇళ్లను ప్రభుత్వం అప్పగించనుంది. 365, 430 చదరపు
అడుగులకు సంబంధించి వారు కట్టిన మొత్తంలో 50శాతం డబ్బును సబ్సిడీ రూపంలో
ఇస్తున్నట్టు సీఎం జగన్‌ ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు.  దీంతో 365 చదరపు
అడుగుల లబ్ధిదార్లకు రూ.25వేలు, 430 చదరపు అడుగుల లబ్ధిదార్లకు రూ.50 వేలు
సబ్సిడీ అందనుంది. ఈ మేరకు మినహాయించిన నగదును ప్రభుత్వం వెనక్కి ఇవ్వనుంది.
టిడ్కో కాలనీలకు వైఎస్‌ జగనన్న నగర్‌గా పేరుపెట్టేందుకు కేబినెట్‌ ఆమోదం
తెలిపింది.

►అమరావతి ప్రాంతంలో ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (రోడ్లు) మరియు ఎల్‌పియస్‌ పనులు
(సమీకరించిన భూముల్లో పనులు)కు సంబంధించి రూ.3వేల కోట్ల నిధులకు ప్రభుత్వ
గ్యారంటీ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం

►ఆర్బీకేల పరిధిలో మల్టీ పర్పస్‌ సెంటర్లు (బహుళ సదుపాయాల కేంద్రాలు),
జనతాబజార్లు, ఫామ్‌ గేటు మౌలికసదుపాయాలు తదితర వాటి ఏర్పాటు విధానానికి
సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం 

►వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో పంట నాటుకునే ముందు, పంట చేతికొచ్చిన తర్వాత
రైతుకు కావాల్సిన మౌలిక సదుపాయల కల్పనే ఈ మల్టీ పర్పస్‌ సెంటర్ల ఉద్దేశం

రూ. 2719.11  కోట్లతో ఫామ్‌ గేట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివద్ధి చేసేందుకు
కేబినెట్‌ ఆమోదం 

ఈ మొత్తం పనులన్నింటినీ సుమారు రూ.12 వేల కోట్లతో చేపట్టనున్న ప్రభుత్వం

►చిత్తూరు జిల్లా పెనుమూరులో,  కార్వేటినగరంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను
50 పడకల ఆసుపత్రులుగా మార్చేందుకు కేబినెట్‌ ఆమోదం

►పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్‌ పోస్టులు, 1 నాన్‌
టీచింగ్, 13 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం

►వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి జాయింట్‌ వెంచర్‌ ఎంపిక
ప్రక్రియకు కేబినెట్‌ ఆమోదం

Flash...   పది లక్షల్లో సేఫెస్ట్.. చీపెస్ట్ కార్లు ఇవే.. టాప్ క్లాస్ ఫీచర్లతో మార్కెట్లో ఫుల్ డిమాండ్

ఎస్‌.బి.ఐ.క్యాప్‌ సిఫార్సుల ప్రకారం జాయింట్‌ వెంచర్‌ భాగస్వామి ఎంపికకు ఆమోదం

ఎస్‌బీఐక్యాప్‌ సిఫార్సులను అనుసరించి లిబర్టీ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ జేవీగా
ఎంపిక

తొలిదశలో రూ. 10,082 కోట్ల వ్యయం, రెండో దశలో రూ.6వేల కోట్లు వ్యయం

జేవీపై వైఎస్సార్‌ స్టీల్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీకి ఎల్‌ఓఏ ఇచ్చేందుకు
అనుమతి

►వైఎస్సార్‌ జిల్లా జమ్ములమడుగు మండలం పెద్దండ్లూరు, సున్నపురాళ్లపల్లె
గ్రామాల్లో 3148.68 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ హైగ్రేడ్‌
స్టీల్స్‌కు కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం. ఈ స్ధలంలో స్టీల్‌ ప్లాంట్‌
నిర్మాణానికి నిర్ణయం.

►వైఎస్సార్‌ జిల్లా వల్లూరు మండలం అంబాపురంలో 93.99 ఎకరాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో
మెగా ఇండస్ట్రియల్‌ పార్కు కోసం భూమి కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం

►వైఎస్సార్‌ జిల్లా సీ కే దిన్ని మండలం  కొప్పర్తిలో 598.59 ఎకరాల్లో మెగా
ఇండస్ట్రియల్‌ పార్కు నిర్మాణానికి ఏపీఐఐసీకి  స్ధలం కేటాయింపు

►తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామంలో 165.34 ఎకరాలు ఏపీ మారిటైం
బోర్డుకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం. పోర్టు కార్యకలాపాల
కోసం భూమి కేటాయింపు. ఎకరా రూ.25 లక్షలు చొప్పున భూమి కేటాయింపు

ఆంధ్రప్రదేశ్‌ గేమింగ్‌ యాక్టు –1974 సవరణకు కేబినెట్‌ ఆమోదం

►వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం ముద్దనూరులో నూతన అగ్నిమాపక కేంద్రం
నిర్మాణానికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. 12 పోస్టులు మంజూరు

►చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జీడీ నెల్లూరు, పుంగనూరు నియోజకవర్గంలో సదుం
మండలంలో కూడా మరో రెండు కొత్త అగ్నిమాపక కేంద్రాల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం

►తిరుమల తిరుపతి దేవస్ధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్ధలాల పంపిణీకి రాష్ట్ర
ప్రభుత్వం అనుమతి కోరిన టీటీడీ. ఇందుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. 

►ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి రెడ్‌హేండెడ్‌గా పట్టుబడ్డ  డిసిప్లీనరీ
కేసులను 100 రోజుల్లోగా పూర్తి చేయాలని నిర్ణయం, కేబినెట్‌ ఆమోదం.