ATM CONTACTLESS MONEY WITHDRAW

 ఏటీఎంను టచ్ చేయకుండానే డబ్బులు విత్‌డ్రా.. సూపర్ టెక్నాలజీ

ATM New Technology: ఏటీఎంలలో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది.
ఏటీఎంను టచ్ చేయకుండానే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. మొబైల్ స్క్రీన్ పైనే
అన్నీ చేయొచ్చు. ఆ వివరాలు… 

ఏటీఎంలలో త్వరలో సరికొత్త టెక్నాలజీ.

ఏటీఎంను టచ్ చేయకుండానే నగదు డ్రా.

మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేషన్.. ప్రయోజనాలివే

CONTACTLESS-WITHDRAWAL

బ్యాంక్ ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవడంలో ఏటీఎంలు తెచ్చిన మార్పు
విప్లవాత్మకమైనది. అయితే.. కరోనా సంక్షోభం కొత్త సవాల్ విసిరింది. ఏటీఎంల ద్వారా
వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఇప్పటికీ కొంత మంది ATM సెంటర్లకు
వెళ్లడానికి జంకుతున్నారు. ఈ క్రమంలో కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్ల కోసం
పరిశోధనలు విస్తృతంగా సాగుతున్నాయి. ఈ దిశగా గొప్ప ముందడుగు పడింది.

మాస్టర్‌ కార్డ్ ద్వారా ఇప్పుడు ఏటీఎంను టచ్ చేయకుండానే నగదు విత్‌డ్రా
చేసుకోవచ్చు. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాల‌జీస్‌ ఈ కాంటాక్ట్‌లెస్ న‌గ‌దు
విత్‌డ్రాకు అవకాశం కల్పిస్తోంది. ఈ విధానంలో కేవలం నాలుగే స్టెప్పులు ఉపయోగించి
ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఇందుకోసం వినియోగదారుల సెల్ ఫోన్‌లో సదరు
బ్యాంక్ మొబైల్ యాప్ ఉండాలి.

4 స్టెప్పుల్లో కాంటాక్ట్‌లెస్ ఏటీఎం విత్‌డ్రా..

1.ఏటీఎంకు వెళ్లగానే వినియోగదారుడు తమ బ్యాంక్ మొబైల్ యాప్‌ను ఓపెన్ చేయాలి.

2.మొబైల్ అప్లికేష‌న్‌ను ఉప‌యోగించి ఎటీఎం తెర‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను
స్కాన్ చేయాలి.

3.ఆ తర్వాత మొబైల్ యాప్‌లోనే కావాల్సిన ఎమౌంట్, పిన్‌ను ఎంటర్ చేయాలి.

4.అప్పుడు ఏటీఎంలో న‌గ‌దు విత్‌డ్రా ప్రాసెస్ అవుతుంది. చివరగా ఏటీఎం నుంచి
వచ్చిన డబ్బులను కలెక్ట్ చేసుకోవాలి.

ఈ విధానంతో పలు ప్రయోజనాలు ఉన్నాయని AGS Transact Technologies Limited చైర్మన్,
ఎండీ రవి బి గోయల్ తెలిపారు. ఏటీఎంల‌లో మోసాల‌ను త‌గ్గించ‌డంలోనూ ఈ విధానం
దోహదపడుతుందని చెప్పారు. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాల‌జీస్ మొద‌ట బ్యాంక్ ఆఫ్
ఇండియాతో క‌లిసి కాంటాక్టెలెస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏటీఎం
విత్‌డ్రా విషయంలో ఇది గేమ్ ఛేంజర్ కానుందని గోయల్ అన్నారు.

Flash...   AP ఇంటర్‌ అర్హతతోనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగం.. HCL తో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం

సమీపంలోని ఏటీఎంలను లొకేట్ చేయడం తదితర ఇతర సేవలను కూడా ఈ విధానంలో అందుబాటులోకి
తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని బ్యాంకులకు కూడా ఈ
కాంటాక్ట్‌లెస్ విత్‌డ్రా సేవలను విస్తరించనున్నారు. ఈ సేవలను అందించ‌డానికి
బ్యాంకుకు అవ‌స‌ర‌మ‌య్యే కొన్ని సాఫ్ట్‌వేర్ మార్పులను ఏటీఎంల‌లో సెట్ చేయాల్సి
ఉంది.