పదోతరగతి, ఐటీఐతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా..! అయితే ఈ
నోటిఫికేషన్ మీకోసమే.. అస్సలు మిస్ కాకండి..
Indian Navy Notification: పదో తరగతి, ఐటీఐ చదివిన యువకులకు సువర్ణావకాశం.
ఇండియన్ నేవీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. తక్కువ విద్యార్హతతో
Indian Navy Notification: పదో తరగతి, ఐటీఐ చదివిన యువకులకు సువర్ణావకాశం.
ఇండియన్ నేవీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. తక్కువ విద్యార్హతతో నేవీలో పనిచేసే
అవకాశం మిస్ కాకండి. ఇందులో ఎంపికైతే అన్ని కలుపుకొని 30 వేల వరకు సాలరీ
పొందవచ్చు. నోటిఫికేషన్ గురించి వివరాలు ఇలా ఉన్నాయి. వివిధ నావల్ కమాండ్‌లలో
ఖాళీగా ఉన్న ట్రేడ్స్ మ్యాన్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్
విడుదల చేసింది. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1159 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికోసం
సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఐఎన్‌సీఈటీ టీఎంఎంను నిర్వహిస్తారు. ఇందులో
ఈస్టర్న్ నావల్ కమాండ్‌లో 710, వెస్టర్న్ నావల్ కమాండ్‌లో 324, సౌతర్న్
నావల్ కమాండ్‌లో 125 చొప్పున పోస్టులు ఉన్నాయి.
పదో తరగతి ఉత్తీర్ణులై సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. 18 నుంచి 25 ఏండ్ల
లోపు వారు అర్హులు. ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష ద్వారా ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేసి
ఎంపికైన వారిని రాతపరీక్షకు పిలుస్తారు. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్
ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 22 నుంచి అప్లికేషన్స్ స్వీకరిస్తారు. దరఖాస్తులకు
చివరితేదీ మార్చి 7గా నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్:
joinindiannavy.gov.in సందర్శించండి.