SSC పాసైనవారికి వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు… సిలబస్ ఇదే

 SSC Recruitment 2021: టెన్త్ పాసైనవారికి వేల సంఖ్యలో ప్రభుత్వ
ఉద్యోగాలు… సిలబస్ ఇదే

ssc-jobs

SSC Recruitment 2021 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల
భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ వివరాలు
తెలుసుకోండి

టెన్త్ పాసైనవారికి గుడ్ న్యూస్. టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
పొందొచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్
పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ కొద్ది రోజుల క్రితమే విడుదలైంది.
దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2021 మార్చి 21 లోగా అప్లై చేయాలి. ఈ
నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC
అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో
తెలుసుకోవచ్చు. ఇక ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్‌ను
నోటిఫికేషన్‌లు వివరించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. రెండు దశల పరీక్ష ద్వారా ఈ
పోస్టులకు ఎంపిక చేయనుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. 10వ తరగతి అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందొచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగులు చాలాకాలంగా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న సంగితి తెలిసిందే. మొత్తానికి నోటిఫికేషన్ వచ్చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 21 చివరి తేదీ. ఖాళీల వివరాలను ప్రకటించలేదు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో ఖాళీల వివరాలను అప్‌డేట్ అవుతాయి. అభ్యర్థులు ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Candidate‟s Corner సెక్షన్‌లో Tentative Vacancy పైన క్లిక్ చేసి ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు. గతంలో మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్-MTS నోటిఫికేషన్ ద్వారా 9069 పోస్టుల్ని భర్తీ చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. ఈసారి కూడా అంతే సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయొచ్చు.

Flash...   Tours & Travels : 2023 లో గూగుల్‌లో ఎక్కువమంది సర్చ్‌ చేసిన టాప్‌ 10 places ఇవే

SSC MTS Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

నోటిఫికేషన్ విడుదల- 2021 ఫిబ్రవరి 5

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 5

అప్లికేషన్‌కు చివరి తేదీ- 2021 మార్చి 21 రాత్రి 11.30 గంటలు

ఆన్‌లైన్ ఫీజు పేమెంట్‌కు చివరి తేదీ- 2021 మార్చి 23 రాత్రి 11.30 గంటలు

చలాన్ జనరేషన్‌కు లాస్ట్ డేట్- 2021 మార్చి 25 రాత్రి 11.30 గంటలు

చలాన్ పేమెంట్‌కు లాస్ట్ డేట్- 2021 మార్చి 29 బ్యాంకు వేళలు ముగిసేలోపు

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్ 1)- 2021 జూలై 1 నుంచి జూలై 20

టైర్ 2 ఎగ్జామినేషన్- 2021 నవంబర్ 21.

SSC MTS Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

మొత్తం ఖాళీలు- త్వరలో వెల్లడించనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్

విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి

వయస్సు- 2021 జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ
అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం- రెండు దశల పరీక్ష

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు- ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు,
కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ,
విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను
https://ssc.nic.in/
వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్
పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

SSC Recruitment 2021: సిలబస్ వివరాలు ఇవే…

పేపర్ పరీక్షలో 100 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్,
రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్‌కు 25 మార్కుల చొప్పున
ఉంటాయి. 90 నిమిషాల్లో పేపర్-1 పూర్తిచేయాలి.

పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్
రీజనింగ్‌పై ప్రశ్నలు ఉంటాయి. నాన్ వర్బల్ టైప్ ప్రశ్నలుంటాయి. సిమిలారిటీస్ అండ్
డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జ్‌మెంట్,
డిసిషన్ మేకింగ్, విజువల్ మెమొరీ, డిక్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్‌షిప్
కాన్సెప్ట్స్, ఫిగర్ క్లాసిఫికేషన్, ఆర్థమెటికల్ నెంబర్ సిరీస్, నాన్ వర్బల్
సిరీస్ లాంటి టాపిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

Flash...   Transfer of strength from other schools in child info - to escape transfers – Certain Instructions

న్యూమరికల్ యాప్టిట్యూడ్‌లో నంబర్ సిస్టమ్స్, కంప్యుటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్,
డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రేషియో, ప్రాపరేషన్, యావరేజెస్, ఇంట్రెస్ట్,
ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్,
టైమ్ అండ్ వర్క్ లాంటి టాపిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

జనరల్ ఇంగ్లీష్‌కు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్
విషయానికి వస్తే వొకాబ్యులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్,
ఆంటోనిమ్స్ లాంటి ప్రశ్నలుంటాయి. జనరల్ అవేర్‌నెస్‌పైనా ప్రశ్నలుంటాయి. ఇందులో
కరెంట్ ఈవెంట్స్, స్పోర్ట్స్, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనమిక్ సీన్, జనరల్
పాలిటీ, ఇండియన్ కాన్‌స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్ లాంటి అంశాలకు సంబంధించిన
ప్రశ్నలుంటాయి.

పేపర్ 1 క్వాలిఫై అయినవారు పేపర్ 2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో బేసిక్
లాంగ్వేజ్ స్కిల్స్ పరీక్షిస్తారు. షార్ట్ ఎస్సే, లెటర్ రాయాల్సి ఉంటుంది. పేపర్
2పరీక్షలో షార్ట్ ఎస్సేకు 50 మార్కులుంటాయి. 30 నిమిషాల్లో పేపర్-2 పరీక్ష పూర్తి
చేయాలి.