విట్ లో మెరిట్ స్కాలర్షిప్స్

 విట్-ఎపి విశ్వవిద్యాలయంలో నాన్ ఇంజినీరింగు డిగ్రీ కోర్సుల్లో చేరే అభ్యర్థులు స్కాలర్షిప్కు దరఖాస్తులు చేసుకునేందుకు ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ విశ్వనాథన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జివి మెరిట్ స్కాలర్షిప్, రాజేశ్వరి అమ్మాళ్ మెరిట్ స్కాలర్షిప్ ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎ-బోర్డు టాపర్ కు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం కింద జివి మెరిట్ స్కాలర్షిప్ కింద అన్ని సంవత్సరాలకూ 100 శాతం అందిస్తామని తెలిపారు. 

రాజేశ్వరి అమ్మాళ్ మెరిట్ స్కాలర్షిప్ పొందాలంటే దేశవ్యాప్తంగా ఏదైనా జిల్లా టాపర్ గా ఉండాలని తెలిపారు. వీరికి కోర్సు పూర్తయేవరకు ఏడాదికి 50శాతం స్కాలర్షిప్ ఉంటుందని వివరించారు అమ్మాయి అయితే అదనంగా 25 శాతం ఉంటుందన్నారు. మే 31 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. 

మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ గానీ www.vitap.ac.in 7901091283 నెంబర్, admission@vitap.ac.in మెయిల్ను సంప్రదించాలని తెలిపారు.

Flash...   పెట్రోల్-డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చుకోవచ్చా? కీలక సమాచారం మీకోసం..