విద్యార్థులకు రూ.20,000 స్కాలర్‌షిప్‌.. ఫిబ్రవరి 15 చివరితేది

బడ్డీ 4 స్టడీ ఇండియా ఫౌండేషన్

డాక్టర్ అబ్దుల్ కలాం స్కాలర్‌షిప్స్‌

మెడికల్, ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్న విద్యార్థులు అర్హులు

ఫిబ్రవరి 15 దరఖాస్తులకు చివరితేది

BDDY4-STUDY

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మెడికల్, ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్న విద్యార్థులకు
బడ్డీ 4 స్టడీ ఇండియా ఫౌండేషన్ ( Buddy4Study India Foundation) డాక్టర్ అబ్దుల్
కలాం స్కాలర్‌షిప్ అందిస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్య
అభ్యసించేందుకు వీలుగా ఈ స్కాలర్‌షిప్‌ రూపకల్పన చేశారు. అర్హులైన విద్యార్థులు
రూ.20,000 స్కాలర్‌షిప్ పొందొచ్చు

ఎంపిక:

విద్యార్థుల అకడమిక్ రికార్డ్‌తో పాటు ఆర్థిక అవసరాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత
టెలిఫోన్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఫైనల్ సెక్షన్‌కు ముందు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ
ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయడానికి 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ

నిబంధనలు:

జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న
విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు.

ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌) మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు
చేసుకోవాలి.

విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలి.

ఇంటర్‌/12వ తరగతిలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాలి.

12వ తరగతి లేదా ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు
చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్, మెడిసిన్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు
చేయకూడదు.

ఇంజనీరింగ్, మెడిసిన్‌లో చేరాలనుకునే విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

అవసరమైన ధ్రువపత్రాలు:

ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, 12వ తరగతి మార్క్స్ షీట్, ఇన్‌కమ్
సర్టిఫికెట్, దరఖాస్తుదారుల క్యాన్సల్డ్ చెక్ లేదా పాస్‌బుక్ కాపీ ఉండాలి.

దరఖాస్తుకు ఇక్కడ క్లిక్‌ చేయండి:

Flash...   SBI PO 2023 Notification for 2000 Probationary Officers