సచివాలయ సిబ్బందికి సర్వీస్ రూల్స్

 మార్చి 30లోపు అందించాలి

ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్.

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి సర్వీసు రూల్స్ రూపొందించాలని గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. మార్చి 30లోపు ఆయా శాఖల సిబ్బందికి సర్వీసు పుస్తకాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఉద్యోగపరమైన ప్రయోజనాలు కూడా అందజేయాలన్నారు సచివాలయాల సిబ్బంది సర్వీస్ రూల్స్, సెలవు నియమావళి, కారుణ్య నియామకాలు, డ్రెస్ కోడ్ తదితర అంశాలపై అజయ్ జైన్ గురువారం సమీక్ష నిర్వహించారు. శాఖాపరమైన శిక్షణతోపాటు, సర్వీస్, ప్రవర్తనా, సిసిఎ, సెలవు నియమావళి, కంప్యూటర్ పరిజ్ఞానం వంటి అంశాల్లో శిక్షణ పొందాలని చెప్పారు ఈ సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల కమిషనరు నారాయణ భరత్ గుప్తా, సర్వే శాఖ కమిషనరు సిద్ధార్థ జైన్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కమిషనరు ఎంఎం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 ♦వేతనాలు పెంచాలి: సిఎంకు ఉద్యోగుల లేఖ

వార్డు, సచివాలయాల సిబ్బందికి వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రిని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కోరింది. 2015 పిఆర్సి ప్రకారం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు చేయాలని ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జానీపాష షేక్ ఎమ్ డి గురువారం లేఖ రాశారు. సర్వీస్ రిజిస్టర్ కూడా ఏర్పాటు చేయాలని కోరారు. నెలకు ఐదు రోజులు మండల కార్యాలయానికి వెళు న్నామని, ఎటిఎ, టీఎ సౌకర్యం కల్పించాలని తెలిపారు. మహిళా ఉద్యోగుల బదిలీలపై ఉన్న బ్యాస్ ఎత్తివేసి, వారిని నివాస ప్రాంతానికి దగ్గరగా బదిలీ చేయాలని కోరారు. శానిటేషన్ విభాగం వారికి వారాంతపు సెలవు కల్పించాలన్నారు. కొంతమంది ఉద్యోగులు రోడ్డు ప్రమాదంలో మరణించారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

Flash...   TS: 158 రోజుల తర్వాత తెరుచుకున్న బడులు.. హాజరుకాని పిల్లలు.. టీచర్లు మాత్రమే విధులకు