జగనన్న వసతి, విద్యాదీవెనకు సచివాలయాల్లోనే దరఖాస్తు చేసుకోవాలి

 అనంతపురం , మార్చి 15: జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన పథకాలకు సమీపంలోని సచివాలయాల్లోనే ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకో వాలని సాంఘిక సంక్షేమశాఖ డీడీ విశ్వమోహన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు 2020-21 విద్యా సంవత్సరానికి సంబందించి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈవీసి, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా సచివాలయాల్లోకి వెళ్లి అన్ని ధ్రువపత్రాలతో ఆన్లైన్ లో జగనన్న వసతిదీవెన, విద్యాదీవెన పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సచివాలయాల్లో చేసుకున్న దరఖాస్తులను తిరిగి విద్యార్థి చదివే గళశాలలో మూడు రోజుల్లోపు ప్రిన్సిపాల్కు అందజేయాలన్నారు. వివరాలకు జిల్లా కేంద్రంలోని BC, ఎస్సీ, ఎస్ట్ మైనార్టీ సంక్షేమ శాఖల కార్యాలయాల్లో, సంవాలయాలు, ఆయా కళాశాలలో సంప్రదించాలని తెలిపారు

Flash...   sugar patients : షుగర్ పేషేంట్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఆ.. కణాలను’ తొలగిస్తే.. శాశ్వత నివారణ అంటున్న శాస్త్రవేత్తలు