ప్రభుత్వ బడుల్లో 8వ తరగతి సుంచి కోడింగ్ శిక్షణ

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు నురేష్

శ్రీకాళహస్తి, ఏర్పేడు, న్యూస్టుడే: పరిశోధన లకు పెద్దపీట వేయడమే కాకుండా ప్రభుత్వ బడుల్లో కోడింగ్ పై శిక్షణ ఇప్పించాలని నిర్ణయించి నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు ఐఐటీ ఆవర లలో శనివారం కేంద్ర, రాష్ట్ర స్థాయిలో 37 విశ్వ విద్యాలయాల నిష్ణాతులతో ఏర్పాటు చేసిన సమా వేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మంత్రి హాజర య్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రస్థాయిలోని ఉన్నత విద్యా  మండళ్లు , రాష్ట్రస్థాయిలో ఉన్న వాటికి మధ్య ఉన్న తేడాలను సవరించేందుకు, మౌలిక వసతుల కల్పనకు జీవో 11ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆ మేరకు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాంకేతిక విద్యను మరింతగా అందుబాటులోకి తెచ్చే క్రమంలో వచ్చే విద్యా సంవత్సరం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి సుంచి కోడింగ్ నేర్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, తిరుపతి IIT డైరెక్టర్ సత్యనా రాయణ  , తదితరులు పాల్గొన్నారు.

Flash...   UPDATED IMMS MOBILE APP 1.8.0