విదేశాలలలో ఉన్నత విద్య చదవాలనుకుంటున్నారా … ఉత్తమ కాలేజీ లు , ట్యూషన్ ఫీజు సమగ్ర సమాచారం

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటారా? ఏ దేశంలో క్వాలిటీ ఎడ్యూకషన్ దొరుకుంతుంది, అక్కడ ట్యూషన్ ఫీజు ఏ స్థాయిలో ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత మేరకు ఉండొచ్చు అనే ఆలోచనలు మెదళ్లను తొలిచేస్తున్నాయా? అయితే ఈ కింది సమాచారం మీకోసమే.. వివరాల్లోకి వెళితే.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే చాలా మంది విద్యార్థులు తమ గమ్యస్థానాలుగా అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలను ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే.. ప్రపచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీలు ఎక్కువగా ఈ మూడు దేశాల్లో ఉన్నాయి.

ట్యూషన్ ఫీజు:

యూఎస్, యూకే, కెనడా దేశాల్లోని యూనివర్సిటీల్లో ట్యూషన్ ఫీజులను ఒక్కసారి గమనిస్తే.. అమెరికాలో ఫీజులు అత్యధికంగా ఉన్నాయి. ఇక్కడ సంవత్సరానికి సగటున 28వేల డాలర్ల వరకు ట్యూషన్ ఫీజు ఉంటుంది. కొన్ని యూనివర్సిటీల్లో అత్యధికంగా ఇది ఏడాదికి 50వేల డాలర్ల వరకు కూడా ఉండొచ్చు. అదే యూకేలో చూసినట్టేయితే తక్కువలో తక్కువ ఏటా సరాసరి 20వేల డాలర్ల వరకూ ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పై రెండు దేశాలతో పోల్చితే కెనడాలో ట్యూషన్ పీజులు తక్కువగా ఉంటాయి. ఇక్కడ సంవత్సరానికి సగటు ట్యూషన్ ఫీజు 12వేల డాలర్లు మాత్రమే. 7,500 డాలర్ల నుంచి మొదలు కొని అత్యధికంగా 26వేల డాలర్ల వరకు ఫీజులుంటాయి. 

కాస్ట్ ఆఫ్ లివింగ్( జీవన వ్యయం):

బ్రిటన్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్.. ఏడాదికి 16వేల డాలర్ల నుంచి 22వేల డాలర్ల వరకు ఉంటుంది. అండర్ గ్రాడ్యూయేట్ కోర్సులలో (లాంగ్వేజ్, మెడిసిన్ కోర్సులు మినహా) ప్రవేశం పొందినవారు కాస్ట్ ఆఫ్ లివింగ్ కింద మూడు సంవత్సరాల్లో సుమారు 48వేల డాలర్ల నుంచి 66వేల డాలర్ల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే కోర్సును బట్టి, నగరాలను బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఉదహరణకు లండన్ వంటి ఖరీదైన నగరాల్లో విద్యను అభ్యసించే వారు అధిక మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది. 

అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ సంవత్సరానికి 16వేల డాలర్ల వరకు ఉంటుంది. అయితే మీరు చదవే యూనివర్సిటీ ఉండే ప్రదేశాన్ని బట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ మారుతూ ఉంటుంది. యూనివర్సిటీ పట్టణ ప్రాంతంలో ఉంటే ఖర్చ అధికంగానూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే.. తక్కువగానూ ఉంటుంది. అంతేకాకుండా మీరు క్యాంపస్‌లో ఉంటారా.. లేక బయట ఉంటారా అనే దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. 

Flash...   BSNL దీపావళి బంపర్ ఆఫర్ . అత్యుత్తమ ప్లాన్స్ ప్రకటించిన బీ ఎస్ యెన్ ఎల్ ..

పై రెండు దేశాలతో పోల్చితే కెనడాలో జీవన వ్యయం తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏడాదికి సగటున 10వేల డాలర్ల వరకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. జీవన వ్యయం కింద 8,500 డాలర్ల నుంచి అత్యధికంగా 13వేల డాలర్ల వరకు విద్యార్థులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

స్కాలర్‌షిప్ అవకాశాలు:  

కెనడియన్ విశ్వవిద్యాలయాలలో అంతర్జాతీయ విద్యార్థులకు విస్తృత స్థాయిలో స్కాలర్‌షిప్‌లతో పాటు ఫైనాన్షియల్ ఎయిడ్ ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అదే బ్రిటన్ విషయానికి వస్తే.. దురదృష్టవశాత్తు, బ్రిటిష్ విశ్వవిద్యాలయాల్లోని అంతర్జాతీయ విద్యార్థులకు ఇది వర్తించదు. ఇక్కడ పేరున్న విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తూ స్కాలర్‌షిప్‌ను పొందడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. యుఎస్‌లో.. అధ్యయన వ్యయంతో పోలిస్తే మెరిట్ స్కాలర్‌షిప్ అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. అర్హులైన విద్యార్థులకు అవసరాల నిమిత్తం 100% ఆర్థిక సహాయాన్ని అందించే అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

నాణ్యమైన విద్య: 

ప్రపంచంలోనే టాప్ 10 ఇన్‌స్టిట్యూషన్‌లలో ఐదు విద్యా సంస్థలు అమెరికాలోనే ఉన్నాయి. ఎంఐటీ, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రఖ్యాత యూనివర్సిటీలు అమెరికాలో ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల జాబితాలో అమెరికాలోని 170 యూనిర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. టాప్ 20 జాబితాలో బ్రిటన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూషన్‌లు ఉన్నాయి. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక 100 యూనివర్సిటీల జాబితాలో కేవలం మూడు విశ్వవిద్యాలయాలు మాత్రమే కెనడాకు చెందినవి ఉన్నాయి. టొరెంటో, బ్రిటిష్ కొలంబియా, మెక్‌గిల్ యూనివర్సిటీలు టాప్100లో ఉన్నాయి. 

అడ్మిషన్, అప్లికేషన్ విధానం..

అమెరికాలోని టాప్ కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పెద్దగా ఉంటుంది. అంతేకాకుండా నిర్ణీత పరీక్షలను, ఇంటర్యూలు తదీతర వాటిల్లో విజయం సాధించిన వారికే ప్రవేశం లభిస్తుంది. బ్రిటన్‌లో యూసీఏఎస్ పోర్టల్ ద్వారా దాదాపు ఐదు యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా యూకేలో దరఖాస్తు విధానం కూడా సులభతరంగా ఉంటుంది. కెనడాలో మాత్రం ప్రతి యూనివర్సిటీకి వేరువేరుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మార్కులు, గ్రేడ్‌లకు సంబంధించిన సర్టిఫికేట్లు, ఎల్ఓఆర్‌తో పాటు వ్యాసాలు/వీడియో కాలింగ్ జవాబుల ద్వారా యూనివర్సిటీలు అడ్మిషన్ ఇస్తాయి. 

Flash...   Post Office Savings: పోస్టాఫీస్‌లో నెలకు రూ.500 జమ చేస్తే.. 5 ఏళ్ల తర్వాత ఎంతొస్తుంది?

వీసా పొందే ప్రక్రియ..

అమెరికాలో ఉన్నత చదువు కోసం వెళ్లే విద్యార్థులు ‘ఎఫ్-1’ వీసా పొందాల్సి ఉంటుంది. దీని కోసం చాలా సమయం వెచ్చించాల్సి వస్తుంది. అంతేకాకుండా వీసా పొందే ప్రక్రియ కూడా సంక్లిష్టంగా ఉంటుంది. పాయింట్ బేస్డ్ విధానం ద్వారా యూకే ప్రభుత్వం విదేశీ విద్యార్థలకు వీసాలను జారీ చేస్తోంది. అయితే పాయింట్ బేస్డ్ విధానం అనేది సుదీర్ఘ ప్రక్రియ. యూఎస్, బ్రిటన్‌లతో పోల్చితే విద్యార్థులు కెనడాలో వీసా పొందే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడి ప్రభుత్వం కాలయాపన చేయకుండా విదేశీ విద్యార్థులకు వీసాలను మంజూరు చేస్తుంది. 

ఉద్యోగావకాశాలు ఎక్కడ ఎలా ఉంటాయంటే..

ముందుగా కెనడా గురించి మాట్లాడుకుంటే.. పోస్ట్ గ్రాడ్యూయేషన్ వర్క్ పర్మిట్ ద్వారా విదేశీ విద్యార్థులు మూడేళ్లపాటు అక్కడ పని చేసే అవకాశాన్ని కెనడా ప్రభుత్వం కల్పిస్తుంది. దీంతో విద్యార్థులు అక్కడే శాశ్వత నివాసం, కెనడా పౌరసత్వం పొందేందకు మార్గం సుగమం అవుతుంది. 

యూకే ప్రభుత్వం తాజాగా అక్కడ వీసా నిబంధనలను మార్చింది. వాటి ప్రకారం.. బ్రిటన్‌లో గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో చదవు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగం లేకపోయినా పోస్ట్ స్టడీ వర్క్ వీసా ద్వారా కనీసం రెండేళ్ల వరకు అక్కడే ఉండొచ్చు. పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కాలపరిమితి మూడేళ్ల వరకు ఉంటుంది.  

యూఎస్‌ఏలోని విదేశీ విద్యార్థులు ఒక సంవత్సరం పాటు ఆప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ (ఓపీటీ)ని పొందుతారు. స్టెమ్(STEM) గ్రాడ్యూయేట్లు మాత్రం ఇది మూడేళ్ల వరకు ఉంటుంది. ఈ వర్క్ పర్మిట్‌ను వర్క్ వీసా లేదా హెచ్1బీ వీసాగా మార్చు కోవచ్చు. అయితే అలా మార్చుకోవాలంటే ఏదైన ఒక సంస్థ స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా అమెరికాలో విద్యార్థులు వర్క్ వీసా పొందేందుకు చాలా సమయం పడుతుంది.