ఉపాధ్యాయుడి వింత దండన

 స్కూల్ కు లేట్ గా వస్తున్నారని విద్యార్థులతో డక్ వాక్ • ప్రశ్నిస్తే
డ్రిల్ లో భాగమని బుకాయింపు •చర్యలు తీసుకుంటామన్న కమిషనర్.

KRNL-ABN

గుడివాడ, మార్చి 1 స్థానిక ఎస్పీఎస్ మున్సిపల్ హైస్కూల్ పీఈటీ మడకా ప్రసాద్
వ్యవహారశైలి వివాదా స్పదంగా తయారైంది పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారని
విద్యార్థులను పుస్తకాల బ్యాగులు వీపుపై వేసుకుని డక్వాక్ చేయిస్తున్న ఉదంతం
సోమవారం వెలుగులోకి వచ్చింది. విద్యాహక్కు చట్టం ప్రకారం దండనపై నిషేధం ఉన్నా
ఉపాధ్యాయుడే ఇలాంటి చర్యలకు పాల్పడటం పై పట్టణంలో విమర్శలు వస్తున్నా ల, ఇది
చాలాకాలంగా సాగుతోందని పాఠశాల విద్యార్థులు పేర్కొంటున్నారు. విద్యార్థినులతోనూ
డక్ వాక్ చేయించడం ఉపాధ్యాయుడి కర్కశత్వానికి నిదర్శ నమని పిల్లల తల్లిదండ్రులు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదేమంటే రోజూ డ్రిల్లో బాగమేనని సదరు వ్యాయామ
ఉపాధ్యాయుడు పేర్కొనడం గమనార్హం. బాలల హక్కుల సంఘం, మానవహక్కుల సంఘాలకు ఫిర్యాదు
చేస్తామని కొంతమంది తల్లిదండ్రులు చెప్పడం గమనార్హం.మున్సిపల్ కమిషనర్ పి.జె
సంవత్కుమార్ను వివరణ కోరగా తన దృష్టికి రాలేదని, తప్పు చేసినట్టు రుజువైతే
ఉపాధ్యాయుడి మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు

Flash...   REAPPPORTIONMENT OF TEACHERS: Subject Conversion General Rules