ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు

పెరుగుతున్న కరోనా కేసులు.. ఏపీ ‍ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు

కరోనా కేసులు, ఎండల కారణంగా నిర్ణయం

సాక్షి, తాడేపల్లి : కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలవుతుందని చెప్పారు. ఉదయం 7.45 నుంచి 12.30 వరకు తరగతుల అనంతరం మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు. 

కరోనా కేసులు, ఎండల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Flash...   Notification for admission of children in Class I for private unaided schools in AP - Order issued.

1 Comment

  1. The text books for the Higher Secondary First and Second year students are now available in digital format. In the changing scenario of present day, as the class rooms becoming hi tech, it becomes necessary to adopt similar changes in the case of text books also. DHSE Kerala Plus Two Book SCERT/NCERT text books are followed in the State syllabus. While the SCERT books are prescribed for some subjects, NCERT books are followed for certain other subjects.

Comments are closed