దేశంలో ‘తీవ్ర’ స్థాయికి కొవిడ్, ఆ టాప్ 10 జిల్లాలు ఇవే.. కేంద్రం హెచ్చరికలు.

Union Health Ministry: దేశవ్యాప్తంగా 10 జిల్లాలో అత్యధిక యాక్టివ్‌ కేసులున్నాయి. ఇందులో ఎనిమిది ఒక్క మహారాష్ట్రవే. ముంబయి, నాగ్‌పూర్‌, థానె, నాసిక్‌, ఔరంగాబాద్‌, బెంగళూరు అర్బన్‌, నాందేడ్‌, ఢిల్లీ, అహ్మద్‌నగర్‌లో అధిక యాక్టివ్‌ కేసులున్నాయి.


దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయికి..

కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడి

యాక్టివ్ కేసులు అధికంగా ఉన్న 10 జిల్లాల పేర్లు ప్రకటన

వాటిలో 8 మహారాష్ట్ర నుంచే..

మన దేశంలో కొవిడ్ కేసుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కరోనా కేసుల స్థితి తీవ్ర స్థాయికి చేరిందని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మంగళవారం ఉదయమే దాదాపు 56 వేల వరకూ కొత్త కరోనా కేసులు నమోదైయ్యాయి. దీంతో మొత్తం కేసులు 5.5 లక్షలకు చేరాయి.

నమోదవుతున్న కేసులను బట్టి చూస్తే కరోనా వైరస్ ఇంకా ఉద్ధృతంగానే ఉందని వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన జాతీయ నిపుణుల కమిటీ ఛైర్మన్ వీకే పాల్ చెప్పారు. ఈ కేసుల పెరుగుదలలో మ్యుటేషన్ చెందిన స్ట్రెయిన్‌లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. కేసుల పెరుగుదల నియంత్రించేందుకు మాస్కులు వాడడం సహా, ఇతర చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించినట్లుగా చెప్పారు. ప్రజలు మాస్కులు వాడేలా చేయడం కోసం చట్ట ప్రకారం.. ఫైన్లు వేసే అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

దేశవ్యాప్తంగా 10 జిల్లాలో అత్యధిక యాక్టివ్‌ కేసులున్నాయి. ఇందులో ఎనిమిది జిల్లాలు ఒక్క మహారాష్ట్రవే కావడం గమనార్హం. 59 వేల పైచిలుకు క్రియాశీల కేసులతో పుణె అగ్రస్థానంలో ఉండగా.. ముంబయి, నాగ్‌పూర్‌, థానె, నాసిక్‌, ఔరంగాబాద్‌, బెంగళూరు అర్బన్‌, నాందేడ్‌, ఢిల్లీ, అహ్మద్‌నగర్‌లో అత్యధిక యాక్టివ్‌ కేసులున్నాయి. పంజాబ్‌లో కేసులు పెరగడానికి అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అక్కడ ప్రజలకు కొవిడ్‌ పరీక్షలు చేయడం లేదని, వైరస్‌ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది.

Flash...   Post Office Jobs: పది పాసైన వారికి పోస్టాఫీసులో నెలకి 56 వేల తో ఉద్యోగాలు..