బ్యాంకులకు 4 రోజుల వరుస సెలవులు! బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు కారణాలివే.

 ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా రేపటి (శనివారం) నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోనున్నాయి. రెండు రోజులు సెలవు దినాలు కాగా.. మిగిలిన రెండు రోజులూ సమ్మె కారణంగా ఖాతాదారులకు సేవలు దూరం కానున్నాయి. మార్చి 13వ తేదీ రెండో శనివారం, 14వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులూ బ్యాంకులు పనిచేయవు. 15, 16 తేదీల్లో సమ్మె కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, ఏటీఎం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు మాత్రం యథాతథంగా పనిచేయనున్నాయి.

రెండు ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ఒక ప్రభుత్వరంగ బీమా సంస్థను ప్రైవేటీకరించనున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా ఇటీవల కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని బ్యాంక్‌ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో తొమ్మిది యూనియన్లతో కూడిన ది యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) సమ్మె తలపెట్టింది. 10 లక్షల మంది ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా. సమ్మె కారణంగా ఎస్‌బీఐ, కెనరా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. . 

బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు కారణాలివే..

కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా ఒక్కో రంగాన్ని ప్రైవేటు పరం చేస్తూ వస్తోంది. బ్యాంకింగ్ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పబ్లిక్ సెక్టార్, పాత తరం ప్రైవేట్ బ్యాంకులకు చెందిన పది లక్షల మంది ఉద్యోగులు ఈ నెల 15, 16 వ తేదీల్లో సమ్మె చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా ఒక్కో రంగాన్ని ప్రైవేటు పరం చేస్తూ వస్తోంది. బ్యాంకింగ్ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పబ్లిక్ సెక్టార్, పాత తరం ప్రైవేట్ బ్యాంకులకు చెందిన పది లక్షల మంది ఉద్యోగులు ఈ నెల 15, 16 వ తేదీల్లో సమ్మె చేయనున్నారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ప్రైవేటు పరం చేయనున్నామని ప్రకటించారు. దీని ద్వారా డిస్ ఇన్వెస్ట్ మెంట్ డ్రైవ్ నిర్వహిస్తూ వాటిని 1.75 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం రాబట్టనుంది. ఐడీబీఐ బ్యాంక్ తో పాటు మరో రెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఒక ప్రభుత్వ ఇన్స్యూరెన్స్ కంపెనీ ల ప్రైవేటైజేషన్ ప్రక్రియను 2021-22 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ నెల 15, 16న అన్ని బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చింది. తొమ్మిది బ్యాంకింగ్ యూనియన్స్ కలిసి ఏర్పడిన ఈ సంస్థ బ్యాంకు ఉద్యోగుల సంక్షేమార్థం పనిచేస్తుంది.

Flash...   How to update Nominee in PRAN account - List of not updated candidates

ఈ నెల 13, 14న రెండో శనివారం, ఆదివారం సందర్భంగా బ్యాంకులన్నింటికీ సెలవు. ఆ తర్వాత సోమవారం, మంగళవారం అయిన 15, 16 తేదీల్లో బ్యాంకులు సమ్మె బాట పట్టనున్నాయి. దీంతో ఈ నాలుగు రోజుల పాటు బ్యాంకుల సర్వీసులు ఆగిపోనున్నాయి. అయితే ఏటీఎం సేవలు, నెట్ బ్యాంకింగ్ వంటివి కొనసాగే అవకాశం ఉంది. చెక్ క్లియరెన్స్ లు, కొత్త అకౌంట్లను తెరవడం, డీడీలు తీయడం, రుణాల మంజూరు వంటివన్నీ నాలుగు రోజుల పాటు ఆగిపోనున్నాయి. దీనిపై ఎస్ బీఐ స్పందిస్తూ బ్యాంక్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తాము ఇతర ఏర్పాట్లు చేశామని.. అయితే సమ్మె ప్రభావం బ్యాంకింగ్ సేవలపై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఐసీఐసీఐ, హెచ్ డీ ఎఫ్ సీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకుల సేవలు మామూలుగానే కొనసాగనున్నాయి. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి చెక్ క్లియరెన్స్ లు వంటివి జరగాల్సిన సమయంలో ఈ బ్యాంకుల్లోనూ సేవలు పూర్తికావని చెప్పుకోవచ్చు.

అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ (AIBEA) అందించిన సమాచారం ప్రకారం అడిషనల్ ఛీప్ లేబర్ కమిషనర్ ఎస్ సీ జోషి ఆధ్వర్యంలో ప్రభుత్వం, యూనియన్ల మధ్య మార్చి 4, 9, 10 తేదీల్లో సమావేశాలు జరిగాయి. దీని గురించి AIBEA ప్రతినిధి మాట్లాడుతూ ప్రభుత్వం ఈ బ్యాంకులను ప్రైవేటు పరం చేసే ఆలోచనను పునరాలోచించేందుకు సిద్ధమైతే తాము సమ్మెను విరమించుకోవడానికి సిద్ధమని మేం వెల్లడించాం. కానీ ఆర్థిక శాఖ కార్యదర్శి ఆ మేరకు మాకు అంగీకారాన్ని అందించేందుకు ముందుకురాలేదు. దీంతో ఈ సమావేశాల నుంచి ఎలాంటి పాజిటివ్ ఫలితం రాలేదు. అందుకే మేం ముందుగా నిర్ణయించుకున్న మేరకు రెండు రోజుల పాటు సమ్మెను కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నాం అంటూ వెల్లడించింది.