వ్యాక్సిన్‌ తీసుకున్న గర్భిణి..యాంటీబాడీలతో శిశువు జననం

ఫ్లోరిడా, మార్చి 17 : మోడెర్నా కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్న గర్భిణికి జన్మించిన శిశువులో కొవిడ్‌-19 యాంటీబాడీలను గుర్తించినట్లు అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడా వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. పసికందు పుట్టగానే బొడ్డుతాడు రక్తం నమూనాలను పరీక్షించగా కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు ధ్రువీకరణ అయిందని పేర్కొన్నారు. శిశువుకు వైరస్‌ నుంచి రక్షణ లభించేందుకు, ఇన్ఫెక్షన్‌ ముప్పు ను తగ్గించేందుకు తల్లి తీసుకున్న కరోనా టీకా దోహదపడి ఉండొచ్చన్నారు. ఇతర వ్యాక్సిన్లలాగే.. కరోనా టీకా వల్ల కూడా తల్లి నుంచి బిడ్డకు యాంటీబాడీలు అందాయా అనేది తెలుసుకునేందుకు బొడ్డుతాడును ప్రత్యేకంగా పరీక్షించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ యాంటీబాడీల వల్ల శిశువులకు రక్షణ లభిస్తుందా? రక్షణ లభించాలంటే ఎంత మోతాదులో యాంటీబాడీలు ఉం డాలి? అనేది తేలాలంటే మరిన్ని అధ్యయనాలు అవసరమని చెప్పారు. ఈమేరకు వివరాలతో పరిశోధనా పత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. 

Flash...   Declared 13.08.2022 second Saturday is a working day – Compensatory holiday on 27.08.2022