DEO OFFICE IT CELL ‌లో అడ్డగోలు నియామకాలు..!

క్లర్కు, సూపరింటెండెంట్‌ సంతకాల్లేకుండా ఆర్డర్‌

కార్యాలయానికి చుట్టపు చూపుగా డీఈఓ

అధికార పార్టీ పేరుతో టీచర్‌ విచ్చలవిడి

విద్యాశాఖలో ఇష్టారాజ్యం

అనంతపురం విద్య, మార్చి 14: విద్యాశాఖలో అడ్డగోలు వ్యవహారాలకు అంతులేకుం డా పోతోంది. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని డీఈఓ ఆఫీ్‌సకు  చేరుకున్న ఓ టీచర్‌  ఇతర అధికారుల సంతకాలు లేకుండా ఉత్తర్వులు జారీ చేయించేలా పెత్తనం చెలాయిస్తున్నారు. జిల్లా విద్యా శాఖాధికారి తాము ఏమి చెప్పినా వింటాడన్నట్లు వ్యవహరిస్తూ.. సూపరింటెండెంట్లు, ఇతర క్లర్కుల సంతకాలు లేకుండానే ఆర్డర్లు జారీ చేయించడం విమర్శలకు తావిస్తోంది. ఈనెల 3వ తేదీ ఐటీ  సెల్‌కు నలుగురు టీచర్లను నియమిస్తూ.. జారీ చేసిన  ఆర్డర్‌ కాపీనే ఇందుకు నిదర్శనం.

ఆర్డర్‌ కాపీలో డీఈఓ సంతకం మినహా.. సెక్షన్‌పేరు, క్లర్కు, సూపరింటెండెంట్‌ సంతకాలు లేని దృశ్యం

ఐటీ సెల్‌ టీచర్ల నియామకం వెనుక…

ఇటీవల జిల్లా విద్యాశాకాధికారి కార్యాలయంలోని ఐటీ సెల్‌కు నలుగురు టీచర్లను నియమించారు. ఐటీ కార్యక్ర మాల మానిటరింగ్‌ చేయడానికి డివిజన్‌కు ఒకరి చొప్పున నియమించారు. అనంతపురం, ధర్మవరం, పెనుకొండ, గుత్తి డివిజన్లకు సంబంధించి డివిజన్‌కు ఒక టీచర్‌ చొప్పున నలుగురు ఎస్‌జీటీలను నియమించారు. ఈ మేరకు డీఈఓ శామ్యూల్‌ పేరున ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 3న ఈ ఆర్డర్‌ జారీ చేశారు. అయితే ఆ ఆర్డర్‌ ఏ సెక్షన్‌ నుంచి కూడా ఇవ్వలేదని సమాచారం.  జిల్లా విద్యాశాఖలో ఏ, బీ, సీ సెక్షన్లు ఉంటే….ఆ సెక్షన్‌  సూపరింటెండెంట్లు కానీ, ఇతర సీనియర్‌ అసిస్టెంట్లు కానీ ఈ ఉత్తర్వులపై ఎలాంటి సం తకాలు చేయలేదు. అసలు అది తమ నోటీస్‌ కూడా రాలేదని వారు వాపోతున్నారు. 

జిల్లా విద్యాశాఖాధికారి చుట్టపు చూపుగా డీ ఈఓ ఆఫీ్‌సకు వచ్చి వెళ్తుండటంతో… కార్యాలయంలో ఇష్టారాజ్యంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారన్న వి మర్శలకు ఈ ఉత్తర్వులు బలం చేకూరుస్తున్నాయి. గత ఏడాది డీఈఓ ఆఫీ్‌సలో ఐటీ సెల్‌లోకి దొడ్డిదారిన చేరుకున్న ఓ టీచర్‌.. అధికార పార్టీ నేతల జపం చేస్తూ.. అంతా తనదే నన్నట్టు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. ఆయనే సంబంధిత సెక్షన్‌ అఽధికారులతో సంబంధం లేదన్నట్లు ఈ ఆర్డర్‌ను తయారు చేసి, జారీ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఉపాధ్యాయ బదిలీల్లో సైతం ఆయన చక్రం తిప్పి తనకు నచ్చిన వారు స్పౌజ్‌ ఆప్షన్లు అడ్డగోలుగా వాడుకున్నా, అక్రమాలు చేసినా.. డీ ఈఓ దృష్టికి వెళ్లకుండా తొక్కి పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా సెక్షన్‌క్లర్కు, సూపరింటెం డెంట్‌ సంతకాలు లేకుం డా ఉత్తర్వులు జారీ చేయించడం కూడా ఆ కోవకు చెందినదే అంటూ డీఈఓ ఆఫీస్‌ సిబ్బందే గుర్రుగా ఉన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి శా మ్యూల్‌ ఇలాంటి వారి ఆగడాలకు చెక్‌ పెట్టాలని ఆ శాఖాధికారులు కోరుతున్నారు.

Flash...   Reconstitution of Parent Committees – Clarification issued