బడులు మళ్ళీ మూస్తే… జీవనశైలిపై పెను ప్రమాదం

 దేశంలో తిరిగి కరోనా విస్తరిస్తోంది. ఈ ప్రభావంతో విద్యాసంస్థల కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచనలో పడ్డాయి. గతేడాది కరోనా పేరిట పదిమాసాల పాటు విద్యాసంస్థలు మూతబడ్డాయి. విద్యార్థులంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. కొన్ని ఉన్నత స్థాయి విద్యాసంస్థలు ఆన్లైన్ విధానంలో విద్యార్థులకు పాఠాలు బోధించాయి. అయితే ఈ విధానంలో అభ్యాసం చేయడం కొంతమందికే పరిమితమైంది. తిరిగి ఇప్పుడిప్పుడే పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. ఈ దశలోమరోసారి పాఠశాలల మూత ఆలోచన భవిష్యత్ లో విద్యార్థుల ప్రయోజనాలతోపాటు జీవనసరళి, జీవన ప్రమాణాలపై తీవ్రంగా ప్రభావం చూపే ప్రమాదాన్ని నిపుణులు శంకిస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్యాభ్యాసం వరకు రాష్ట్ర ప్రభుత్వ కోర్సుల్ని అమలు చేస్తున్నారు. ఇందుకు సమాంతరంగా జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు కేంద్రం నిర్దేశించిన కోర్సుల్ని కూడా అభ్యాసానికి అందుబాటులో ఉంచుతున్నారు. గత కొన్నేళ్ళలో అంతర్జాతీయ ప్రమాణాలతో, సిలబస్ తో బోధించే విద్యాసంస్థలు కూడా అందుబాటులోకొచ్చేశాయి.

దేశంలో విద్యారంగం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తరించింది. ఈ రంగంలో కార్పొరేటీకరణ వేగంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని విద్యాసంస్థలు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా విధానంతో పోటీపడలేక పోయాయి. ఈ దశలో జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన సీబీఎస్ఈ సిలబన్లను దాదాపు అన్ని రాష్ట్రాలు ప్రవేశపెట్టాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే జాతీయ స్థాయి పోటీకి అనుగుణంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో కూడా ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలు అనుసరించే సిలబాస్ లను ప్రభుత్వ విద్యాలయాల్లోనూ అమల్లోకి తెస్తున్నాయి. మరోవైపు కేంద్రం ఒకే దేశం, ఒకే విద్యా విధానం.. ఒకే పరీక్ష అన్న విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకనుగుణంగా జాతీయ పరీక్షా విధానంలో మార్పులు తెచ్చింది. గతంలో రాష్ట్రాలు నిర్వహించే వైద్యవిద్య ప్రవేశ పరీక్షలను కేంద్రం నాలుగైదేళ్ళ క్రితమే నేరుగా తన పరిధిలోకి తీసుకుంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో నీట్ పరీక్షను నిర్వహిస్తోంది. తాజాగా ఇంజనీరింగ్ విద్యాసంస్థల ప్రవేశాలకు కూడా జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణకు కేంద్రం సమాయత్తమౌతోంది. రాష్ట్రాలు ఇందుకనుగుణంగా తమ విద్యావిధానాన్ని సవరించుకుంటున్నాయి. క్రింది తరగతుల నుంచి పై తరగతుల వరకు సిలబస్లో మార్పులు తెస్తున్నాయి.

Flash...   మీరు PF నుండి ఎంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు

తమ విద్యార్థులు జాతీయస్థాయి పరీక్షల్ని ఎదుర్కొనిర్యాంకులు సాధించే రీతిలో ఆధునిక విద్యా విధానాన్ని అందుబాటులో పెడుతున్నాయి. ప్రభుత్వ రంగంలోని పాఠశాలల్ని తీర్చిదిద్దుతున్నాయి. అదనపు వసతులు కల్పిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరికరాల్ని విద్యార్థులకు అందుబాటలోకి తెస్తున్నాయి. దీంతో ఒకప్పుడు కేరళ, ఢిల్లీ వంటి రాష్ట్రాలవిద్యార్థులకు మాత్రమే జాతీయ స్థాయి పరీక్షల్లో గణనీయమైనర్యాంకులొచ్చే పరిస్థితి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల విద్యార్థులు కూడా ఉన్నత ర్యాంకులు సాధించగలిగే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడుకోటలోని విద్యాసంస్థలు మాత్రమేనీట్ పరీక్షాఫలితాల్లో ముందుండేవి. ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు కూడా ఇలాంటి పరీక్షల్లో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు కరోనా పేరిట మరోసారి లా డౌన్ అమలు చేస్తే విద్యార్థులు బడులకు దూరమౌతారు. విద్యాభ్యాసం వీరికి అందుబాటులో ఉండదు. ఇది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంసల్లోని విద్యార్థులు, ఉన్నస్థాయి కుటుంబీకులు తమ విద్యాభ్యాసాన్ని ఆన్లైన్ తరగతుల ద్వారానైనా పూర్తి చేయగలుగుతారు. పాఠ్యాంశాల్నిక్షుణ్ణంగా అవగాహన చేసుకోగలుగుతారు. అయితే పేద, మధ్య తరగతి కుటుంబీకులకు ఈ అవకాశం అందుబాటులో ఉండదు.

ప్రభుత్వాలు ఆన్లైన్లో తరగతుల నిర్వహణకు సమాయత్తమైనప్పటికీ ఈ కుటుంబాల్లో 90శాతం మందికి ఇంటర్నెట్ కనెక్షన్ గగనకుసుమమే. ల్యాప్టాప్లు, పర్శనల్ కంప్యూటర్లను వీరు కొనుగోలు చేయలేరు. ట్యాన్లు, ఖరీదైన మొబైల్ ఫోన్లను వినియోగించలేరు. అప్పో సప్పో చేసి వాటిని కొనుగోలు చేసినా నిరంతర ఇంటర్నెట్ సదు పాయం వీరికి ఉండదు. ఇవన్నీ ఉన్నా ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థు లకు ఆన్ లైన్లో తరగతుల్ని అవగాహన చేసుకోగలిగే సామర్థ్యం కలిగి ఉండదు. ఇది వీరి భవిష్యత్ పై ప్రభావం చూపిస్తుంది. కోవిడ్ విస్తరణను నియంత్రించే నెపంతో విద్యాసంస్థల్ని తిరిగి మూసేయమన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 8వ తరగతి వరకు పరీక్షల్లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో తూతూ మంత్రంగానే ఎస్ఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతేడాది నుంచి ఇంటర్ తరగతులు కవాడా తెలుగు రాష్ట్రాల్లో జరగలేదు. అయితే జాతీయ స్థాయిలో ఐఐటీ, ఎఐటీలు, వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి కేంద్రం నిర్వహించే పరీక్షల్లో మాత్రం దేశవ్యాప్తంగా ఒకే రకమైన పరీక్షా పత్రాల్ని జారీ చేస్తారు. జాతీయ స్థాయిలో ఉద్దేశించిన సిలబస్కు అనుగుణంగానే ఈ ప్రశ్నాపత్రాలు రూపొందిస్తారు. ఈ పరీక్షలకు ఉన్నత తరగతి కుటుంబాలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వోద్యోగులు, ఆర్థికంగా స్థితిమంతుల పిల్లలతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు కూడా హాజరౌతారు.

Flash...   APCOB Recruitment : ఆప్కాబ్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

అయితే వారితో సమానంగా వీరు పరీక్షల్ని రాయలేరు. ఇందుకు కారణం వీరంతా ఏడాదిన్నర పాటు అభ్యాసానికి దూరంగా ఉంటారు. వీరెవరికీ ఇంటర్నెట్, పర్శనల్ కంప్యూటర్ అందుబాటులో ఉండవు. సిలబసకు సంబంధించిన సమాచారం లభించదు. ఆన్లైన్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధన చేపట్టినప్పటికీ అది వీరికి అవగాహన కాదు. దీంతో జాతీయ స్థాయి పరీక్షల్లో వీరెవరూ తగిన ర్యాంకులు సాధించలేరు. ఈ విషయంలో వెనుకబడతారు. ఈ కారణంగా చిన్న చిన్న స్థానిక కళాశాలల్లోనే తదుపరి తరగతులకు సీట్లు పొంద గలుగుతారు. అందుకనుగుణంగానే వీరి జీవన విధానం ఉంటుంది. తమకు సంబంధంలేని కోవిడ్ కారణంగా వీరు ఆశించిన భవిష్యతకు దూరమౌతారనినిపుణులు విశ్లేషిస్తున్నారు. తాజా యునిసెఫ్ ఓ నివేదిక ప్రకటించింది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా 89కోట్ల మంది విద్యార్థులు పాఠశాలల మూసివేత కారణంగా విద్యాభ్యాసంలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారు. ఇందులో 28.6 కోట్ల మంది భారత్ లోనే ఉన్నారు. ఈ దేశంలోని విద్యార్థుల్లో 80శాతం మందికి తరగతి గది బోధన తప్పింది. మార్చి 2020 నుంచి వీరి అభ్యాసానికి దూరమయ్యారు. యునిసెఫ్ కథనం మేరకు పాఠశాలల మూసివేత భవిష్యత్ లో భారీ సామాజిక, ఆర్థిక నష్టాల్ని కలిగిస్తాయి. ముఖ్యంగా బలహీన వర్గాల పిల్లల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలల మూసివేత కారణంగా ప్రస్తుత విద్యార్థులు తమ జీవితకాల ఆదాయంలో కనీసం 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టానికి గురౌతారు. భారత్ విష యానికొస్తే ఇక్కడ ఇప్పుడు తరగతులు కోల్పోతున్న విద్యార్థులు తమ జీవిత కాలంలో 1.8 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఆర్థిక నష్టాన్ని చవిచూస్తారని ప్రపంచ బ్యాంక్ అంచనాలేసింది. ఆన్లైన్ తరగతుల్ని అన్ని వర్గాల విద్యార్ధులు అవగాహన చేసుకోలేరని కూడాయునిసెఫ్ పేర్కొంది. తద్వారా విద్యావ్యవస్థలో ఇప్పుడున్న అసమానతలు మరింత తీవ్రతరమౌతాయి. బలహీనమైన విద్యార్థులు పాఠశాల అవకాశాల్ని కోల్పోతారు. పిల్లలు ఇళ్ళకే పరిమితమవడం ద్వారా సామాజికాభివృద్ధిని కూడా నష్టపోతారు. భారత్ లో మధ్యాహ్న భోజనం ద్వారా విద్యార్థులకు లభిస్తున్న పోషకాహారాన్ని కూడా కోల్పోతారు. తిరిగి పాఠశాలలు తెరుచుకున్నప్పటికీ విద్యార్ధుల్లో కొందరు తిరిగి హాజరయ్యే అవకాశాలుండవు. డ్రాపౌట్లు మళ్ళీ పెరు గుతాయి. భారత్ లో కోటిమందికి పైగా విద్యార్థులు సుదీర్ఘ లాక్ డౌన్ కారణంగా విద్యాభ్యాసం నుంచి ఇతర పనులకు తరలిపోయినట్లు యునిస్కో ప్రకటించిన అంచనాల్ని ఈ సందర్భంగా యునిసెఫ్ ప్రస్తా వించింది. అలాగే బాలికల్లో బాల్య వివాహాలు,గర్భధారణలు పెరిగే ప్రమాదాన్ని కూడా పేర్కొంది. అజీజ్ ప్రేమ్ జీ విశ్వ విద్యాలయం ఇటీవల దేశంలో ఓ అధ్యయనం నిర్వహిం చింది. పాఠ శాలల లాక్ డౌన్ కారణంగా 92 శాతం మంది పిల్లలు గతేడాది కంటే తమ విద్యా సామర్థ్యంలో కనీస ఒక సబ్జెక్ట్ లో వెనుకబడ్డట్లు ఈ అధ్యయనం గుర్తించింది. వీరంతా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులే. వీరికి ఇంటర్నెట్, కంప్యూటర్లు, ల్యాప్టాన్లు, కొంతమందికైతే విద్యుత్ కవాడా అందుబాటులో లేదని ఈ విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో కరోనా కారణంగా తిరిగి విద్యాసంస్థల్ని మూయాలని ప్రభుత్వాలు నిర్ణయిస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్ధులు తమ అభ్యాసం కోల్పోకుండా ప్రత్యామ్నాయ చర్యలపై నిపుణులు, మేథావులు ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వాల్సి.

Flash...   Teachers Transfers