వాట్సాప్‌ ‘Chat Thread’ ఎలా పనిచేస్తుందో తెలుసా?

 వాట్సాప్‌ ‘చాట్‌ థ్రెడ్‌’ ఫీచర్‌ విడుదల చేసింది. అయితే దాని పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని వాట్సాప్‌ ప్రైవసీ మెసేజింగ్‌ వాట్సాప్‌ తన కస్టమర్ల కోసం సరికొత్త ఫీచర్స్‌ తీసుకువచ్చింది. నూతన ప్రైవసీ పాలసీ ద్వారా వినియోగదారులను కోల్పోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది వాట్సాప్‌. అందుకే గత సంవత్సరం డిసప్పియరింగ్‌ మెసేజ్, వాట్సాప్‌ రీడ్, డిలీట్‌ ఇన్‌ బల్క్‌ వంటి పదికి పైగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా మరిన్ని ఫీచర్లను కూడా త్వరలో తన కస్టమర్ల కోసం తీసుకువస్తామని తెలిపింది వాట్సాప్‌ యాజమాన్యం.ప్రకటించిన విధంగా వినియోగదారులకు యూజర్‌ ఫ్రెండ్లీగా మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకువచ్చింది. అదే ‘వాట్సాప్‌ ఛాట్‌ థ్రెడ్‌’ను పరిచయం చేసింది. దీంట్లో మీరు ఈజీగా సమస్యలను వాట్సాప్‌కు నివేదించవచ్చు. 48 గంటల్లోనే మీ సమస్య పరిష్కారమవుతుంది.

ప్రస్తుతం బీటా వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. అతి త్వరలోనే ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు కూడా పరిచయం చేస్తామని వాట్సాప్‌ తెలిపింది. ఒకవేళ మీరు వాట్సాప్‌ బీటా వినియోగదారులైనప్పటికీ మీకు ఈ ఫీచర్‌ అందుబాటులో లేకపోతే వాట్సాప్‌ బీటా వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని తెలిపింది. తద్వారా మీకు కూడా వాట్సాప్‌ థ్రెడ్‌ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుంది.

ఈ ఫీచర్‌ మీకు అందుబాటులో ఉందా?

  1. వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, హెల్ప్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  2. కాంటాక్ట్‌ అస్‌ అనే ఆప్షన్‌ఫై క్లిక్‌ చేయండి. మీకు ఒకవేళ వాట్సాప్‌ చాట్‌ థ్రెడ్‌ యాక్సెస్‌ ఉంటే, అక్కడ ఒక డైలాగ్‌ బాక్స్‌ కన్పిస్తుంది.
  3. లేదంటే ఎటువంటి డైలాగ్‌ బాక్స్‌ కన్పించదు. మీకు ఫీచర్‌ అందుబాటులో ఉంటే.. దానిలో మీరు ఎదుర్కొంటున్న టెక్నికల్‌ సమస్యను నమోదు చేయండి.
  4. అనంతరం మీరు థ్రెడ్‌ను ప్రారంభించగానే.. వాట్సాప్‌ మీ సమస్యకు పరిష్కారాన్ని గ్రూప్‌ చాట్‌లో చూపిస్తుంది.
  5. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు.. మీ డివైజ్‌ సమాచారం, ఇతర టెక్నికల్‌ వివరాల యాక్సెస్‌ పర్మిషన్‌ అడుగుతుంది. ఈ సమాచారాన్ని వాట్సాప్‌తో పంచుకోవాలా? లేదా? అనే ఆప్షన్‌ కూడా ఇస్తుంది.
  6. ఒకవేళ మీ డివైజ్‌ సమాచారం మాతో పంచుకున్నా ఆ సమాచారం సెక్యూర్‌గానే ఉంటుందని వాట్సాప్‌ తెలిపింది.
  7. ఈ ఏడాది చివరి నాటికి వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను అందరికీ అందుబాటులో ఉండనుంది.
Flash...   Yamaha Bikes: మార్కెట్‌లోకి మరో రెండు కొత్త బైక్స్ రిలీజ్‌ చేసిన YAMAHA .. ధర, ఫీచర్స్ ఇవే!