ఈ ఏటీఎంలల్లో మీరు ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయొచ్చు

ఏటీఎం ఛార్జీలు… ఈ మాట వింటే సామాన్యుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఏ ఏటీఎంలో ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేస్తే ఎంతెంత ఛార్జీలు పడతాయో అని ఎప్పుడూ లెక్కలు వేస్తూనే ఉంటారు. ఇక ముందు దీని గురించి చింతించకుండా ఎస్ బీఐ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది…. ఛార్జీలు లేకుండా ఏటీఎం నుండి ఎన్ని సార్లైనా విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. యోనో క్యాష్ ఫెసిలిటీ ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు కార్డ్‌ లెస్ విత్‌ డ్రాయల్స్‌ లోకి మారాలి. అంటే ఏటీఎం కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడం. ఎస్‌ బీఐ యోనో యాప్‌ తో ఇది సాధ్యం. మీరు యోనో యాప్ డౌన్‌ లోడ్ చేసుకొని మీ యూజర్ ఐడీ, పాస్‌ వర్డ్‌ తో లాగిన్ కావాలి. యాప్‌ కు 6 అంకెల ఎంపిన్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత యోనో క్యాష్ పైన క్లిక్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం…మీకు దగ్గర్లో యోనో క్యాష్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకొని వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

Flash...   CAT Admit Card 2023 : ఈనెల 7వ తేదీన క్యాట్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. పూర్తి వివరాలివే