ఏపీ స్కూల్స్, కాలేజీల్లో కరోనా టెన్షన్ !

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో స్కూల్స్, కాలేజీల్లో కరోనా టెన్షన్ నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ కేసులు ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ తో పాటు కాలేజీల్లో కూడా నమోదు అవుతున్నాయి. విద్యార్థులతో పాటు టీచర్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. దీంతో కరోనా కేసులు నమోదు అయిన స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులు, టీచర్లు ఆందోళన చెందుతున్నారు. అన్ని జిల్లాలో స్కూల్స్, కాలేజీల్లో నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థులతో పాటు టీచర్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. గత ఏడాది నవంబరు నుంచి కాలేజీలతో పాటు 9,10 తరగతి విద్యార్థులకు క్లాసులు ప్రారంభించారు. స్కూల్స్, కాలేజీలు ప్రారంభించినప్పటి నుంచి టీచర్లు, విద్యార్థులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు.

స్కూల్స్, కాలేజీలు ప్రారంభం లో కొంత మంది విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడ్డారు. స్కూల్స్ ప్రారంభించిన తర్వాత విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడటంతో ప్రారంభంలో జిల్లాలో ఆందోళనకు గురయ్యారు. అయితే ఆ తర్వాత స్కూల్స్, కాలేజీల్లో పాజిటీవ్ కేసులు తగ్గిపోయాయి. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలైనా కరోనా టెన్షన్ మరచిపోయి విద్యార్థులు స్కూల్స్, కాలేజీల బాట పట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కాలేజీల్లో కరోనా నిబంధనలు పాటించి క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ మొదలైన తరువాత తిరిగి స్కూల్స్, కాలేజీల్లో కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా భారిన పడిన విద్యార్థులు, టీచర్లకు ప్రత్యేకంగా వైద్య చికిత్స అందిస్తున్నారు. అయిన సరే రోజూ స్కూల్స్, కాలేజీల్లో  నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు టీచర్లు ఆందోళన చెందుతున్నారు

Flash...   LEARN A WORD A DAY - September 2022 WORDS LIST