మార్కెట్‌లోకి 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే ప్రయాణించొచ్చు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరిగాయి. సామాన్యులు తమ వాహనాలను బయటకు తీయాలంటే వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రలో,డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుందడంతోపాటు ట్రాఫిన్ ఆంక్షలు పెరిగాయి. వాహనదారుల సౌకర్యార్థం కంపెనీ వాహన తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా పలు రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిని నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, బీమా అవసరం లేదు. ఎలాంటి రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలు లేకుండానే ఎలక్ట్రిక్ వాహనాలను నడపవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో 5 రకాల ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. 

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ఈ5..

హీరో ఎలక్ట్రిక్ ఆఫ్టిమా ఈ5.. ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోనే అతిపెద్ద ప్రధాన ఆపరేటింగ్ వాహనం. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా E5 48V / 28Ah లిథియం, అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీని టాప్ స్పీడ్ 25 కి.మీ. దీని బరువు 68 కిలోలు. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే 65 కిలోమీటర్ల వరకు నడపవచ్చు.

హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఇ-2..

ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో.. తన ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఇ-2 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. లిథియం అయాన్ బ్యాటరీతో ఈ వాహనం పనిచేస్తుంది. దీని బరువు 69 కిలోలు ఉండగా.. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడవగలదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 65 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలం. దీని బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి 4-5 గంటల సమయం పడుతుంది.

ఆంపియర్ రియో ఎలైట్..

ఆంపియర్ రియో ఎలైట్ అనేది సాంప్రదాయకంగా కనిపించే ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది హోండా డియోను పోలి ఉండే ఆప్రాన్ మౌంటెడ్ హెడ్‌ల్యాంప్‌తో ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, టైల్లైట్, డిజిటల్ కన్సోల్, ఫ్రంట్ ఆప్రాన్ పాకెట్, యుఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ సదుపాయాలు ఉన్నాయి. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన వేరియంట్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.

Flash...   నెల్లూరు GGH ఖాళీ చేసి ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు కోసం పరుగులు తీసిన పేషెంట్స్

ఓకినావా లైట్..

ఫంకీ డిజైన్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈడీ టైలాంప్స్, ఎల్‌ఈడీ ఇండికేటర్స్ వంటి ఫీచర్లతో భారతదేశంలో లభించే మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఓకినావా లైట్. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఒకినావా లైట్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4-5 గంటల సమయం తీసుకుంటుంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఈ స్కూటర్ ప్రయాణిస్తుంది.

ఓకినావా ఆర్-30..

ఓకినావా ఆర్ 30 నుంచి మరో ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ లైసెన్స్, పీయూసీ, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ లేకుండా ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ 30 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే దాదాపు 60 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.