విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలి

 

అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు విపరీ తంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలన్నింటికీ కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటించి మూసేయాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ. ఎ.ఎస్. రామకృష్ణ కోరారు. రెండో దశలో కేసులు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న దృష్ట్యా ఇది అత్యవసరమన్నారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, ఫార్మేటివ్ పరీక్షలలో వచ్చిన మార్కుల ప్రాతి పదికన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేయాలని రామకృష్ణ కోరారు. కాగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు కోవిడ్ బారినపడుతున్న దృష్ట్యా విద్యాసంస్థలకు నిరవధికంగా సెలవులు ప్రకటించి పాఠశాల స్థాయిలో పరీక్షలన్నీ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని టీఎన్య్యఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మూకల అప్పారావు, ఎన్. వెంకట్రావు కోరారు.

పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి: ఎస్ఎల్డీఏ

కరోనా విజృంభణ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించా లని ఎస్ఎల్డీఏ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు. శ్రీనివాసులురెడ్డి, అధ్య క్షుడు అంకాల్ కొండయ్య ప్రధాన కార్యదర్శి జి.శివానందరెడ్డి కోరారు. అనేక గ్రామాల నుంచి స్కూళ్లకు వస్తున్న విద్యార్థులు కొవిడ్ క్యారియ గా మారుతున్నారన్నారు. ఈ తరుణంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించడం, పరీక్షలు రద్దు చేయడం మినహా వేరే మార్గం లేదన్నారు.

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో పాఠశాలలను మూసివేయాలని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా నిర్ణయం తీసుకుం దని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పేర్కొంది. ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్య దర్శి సీహెచ్ శ్రావణ్ కుమార్, ఎస్ బాలాజీలు సం యుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వా న్ని కోరారు. పాఠశాలలు నడపాలని నిర్ణయించడం మంచిదే కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులు, విద్యార్ధులు కరోనా బారిన పడుతున్నారని తెలిపారు. విద్యార్ధులకు, ఉపాద్యాయులకు కరోనా సోకితే వారికి పూర్తి వైద్యాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని అయ్యే ఖర్చును కూడా భరించాలని కోరారు. దురదృ ష్టశావత్తు మరణించిన వారి అంత్యక్రియలను కుటుంబ సభ్యుల సమక్షంలో పూర్తి జాగ్రత్తలతో నిర్వ హించాలని సూచించారు. COVID పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యా యులు కోవిడ్ బారిన పడుతున్నారని, ఇలాంటి ఆపన్న సమయంలో ప్రభుత్వం విద్యా సంస్థలన్నిం టికీ నిరవధిక సెలవులు ప్రకటించాలని టీఎన్ యూ ఎస్ డిమాండ్ చేసిందివిద్యార్థులు,  ఉపాధ్యాయులు కుటుంబానికి కనీసం రూ. 20 లక్షల పరిహారం అందించాలని, ఒక ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని కోరారు. కరోనా నుంచి కోలుకునే వారికి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని ఆపస్ డిమాండ్ చేసింది.
ఈ మేరకు శుక్రవారం టీఎన్ అధ్యక్షుడు అప్పారావు, వెంకట్రావులు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు హైరిస్క్ జోన్లో ఉన్నారని ఇరుకు తరగతి గదుల వల్ల భౌతిక దూరం పాటించడం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని తెలిపారు. తల్లిదం డ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి పొరుగు రాష్ట్రాల   తరహాలో పరీక్షలు రద్దు చేయాలని సూచించారు.


Flash...   Nadu Nedu - Allocation of Adopted Schools & Status of Schools in Phase-1 Instructions