సెలవుపై DEO VIZAG.. charges on chitoor DEO

 ఉపాధ్యాయుల బదిలీల్లో మితిమీరిన ఎమ్మెల్యేల జోక్యం.

విశాఖపట్నం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి సెలవుపై వెళ్లడానికి ఇద్దరు, ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలే కారణమని తెలిసింది. ఈ ఏడాది జనవరిలో సాధారణ బదిలీల తరువాత పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. దీంతో విద్యార్థులు తక్కువగా వున్న పాఠశాలల నుంచి ఆయా పాఠశాలలకు సర్దుబాటు పేరిట ఉపాధ్యా యులను డిప్యుటేషన్‌పై నియమించారు. దీనిపై కొందరు ఉపాధ్యాయులు స్థానిక అధికార పార్టీ నేతల ద్వారా ఎమ్మెల్యేలను కలిశారు. దాంతో డీఈవో లింగేశ్వరరెడ్డికి ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఫోన్‌ చేయగా…అవసరం మేరకే సర్దుబాటు చేశామని వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అయినప్పటికీ డిప్యుటేషన్‌ను రద్దు చేసి వెనక్కి పంపాలని ఒత్తిడి చేయగా డీఈవో అంగీకరించలేదని ఉపాధ్యాయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో రాజకీయంగా ఒత్తిడి పెరగడంతో నెల రోజులు సెలవుపై వెళ్లాలని లింగేశ్వరరెడ్డి నిర్ణయించుకున్నారని తెలిసింది. డీఈవో సెలవుతో డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్‌కు సోమవారం ఇన్‌చార్జి డీఈవోగా బాధ్యతలు అప్పగించారు. తరువాత ఇన్‌చార్జి బాధ్యతలను విశాఖ ఆర్జేడీ నాగేశ్వరరావుకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మంగళవారం సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Flash...   SBI గుడ్ న్యూస్.. లోన్ తీసుకున్న వారు 2 ఏళ్లు EMI కట్టక్కర్లేదు