కరోనాను ఇలా అదుపు చేయొచ్చు-WHO

 

కోవిడ్ 19పై పోరాటంలో ఎవ్వ‌రి ప్ర‌య‌త్నాలు వాలు చేస్తూనే ఉన్నారు.. ఆదిలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గైడ్‌లైన్స్‌లే అంతూ ఫాలో అవుతూ వ‌చ్చారు.. భౌతిక దూరం, శానిటైజ‌ర్, మాస్క్ ఇలా.. క్ర‌మంగా ఆంక్ష‌లు పెరుగుతూ వ‌చ్చాయి.. అయితే, తొలి ద‌శ ముగిసి.. రెండో ద‌శ‌, మూడో ద‌శ‌.. ఇప్పుడు వ‌ణుకుపుట్టిస్తోంది..  ఈ స‌మ‌యంలో.. క‌రోనా ఇలా క‌ట్ట‌డి చేయొచ్చు అంటూ కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించింది డ‌బ్ల్యూహెచ్‌వో..  మ‌హ‌మ్మారి కట్టడి కోసం అవసరమైన వనరులను నిష్ఫాక్షికంగా పంపిణీ చేస్తే క‌రోనాను కొద్ది నెలల్లోనే అదుపులోకి తేవొచ్చు అని తెలిపారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్.. 

ఇక‌, కోవిడ్‌ను అదుపు చేసే సాధనాలు మన ద‌గ్గ‌ర సిద్ధంగా ఉన్నాయ‌ని వెల్ల‌డించిన డ‌బ్ల్యూహెచ్‌వో.. వాటి సాయంతో నెలల వ్యవధిలోనే కరోనాను అదుపులోకి తేవ‌చ్చు అన్నారు.. మ‌రోవైపు..  ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న వ్యాక్సినేష‌న్‌లో కొన్ని దేశాలు జాతీయవాదాన్ని అనుస‌రిస్తున్నాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు పర్యవరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్.. జాతీయవాదాన్ని వీడి.. కోవిడ్ కారణంగా అత్యధిక ప్రమాదం ఎదుర్కొంటున్న వారికే ముందుగా టీకా అందాల‌ని ఆకాంక్షించారు.. కోవిడ్ వ్యాక్సినేష‌న్‌లో ధనిక దేశంలో ఉన్నారా పేద దేశంలో ఉన్నారా అనే అంశం ప్ర‌భావితం చేయ‌కూడ‌ద‌న్న ఆమె.. నైతికంగా ఇదే సరైన చర్యగా తెలిపారు.

Flash...   మొబైల్ లో ఇంటర్ నెట్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!