కరోనా సేవలకు ఉపాధ్యాయులు | ఆస్పత్రుల్లో నోడల్, HELP DESK MANAGERS గా నియామకం
ప్రజాశక్తి- కడప ప్రతినిధి
కడప జిల్లాలోని కరోనా బాధితులు సేవలకు ప్రభుత్వ ఉపాధ్యాయులను నోడల్ ఆఫీసర్లుగా, హెల్ప్ డెస్క్ మేనేజర్లుగా డిప్యూటీ DEO , నియమించారు. జిల్లాలో కరోనా సెకెండ్ వేవ్ ఉద్భతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారినపడిన బాధితులకు మందులు, ఇతర సలహాలతో స్వాంతనకు అవసరమైన సహకారం కోసం ఉపాధ్యాయుల సేవల వినియోగానికి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కమ్యూనిటీ ఆస్పత్రులకు, జిల్లా కోవిడ్ ఆస్పత్రులకు సహకారం కోసం 68 మంది ఉపాధ్యాయులను నియమించారు. వీరిలో జిల్లాలోని 17 కమ్యూనిటీ ఆస్పత్రుల్లో 35 మందికి బాధ్యతలు అప్పగించారు.
వారిలో ఆరుగురు నోడల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. కడపలో నలుగురు, రాయచోటి, జమ్మలమడుగులో ఒక్కొక్కరు చొప్పున వీరిలో ఉన్నారు. మిగతా 29 మందిని హెల్ప్ డెస్క్ మేనేజర్లుగా నియమించారు. మిగతా 33 మంది జిల్లాలోని 18 కోవిడ్ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్ మేనేజర్లుగా నియమితులయ్యారు. హోమ్ క్వారంటైన్లో ఉన్న కోవిడ్ బాధితులకు వీరు ఫోన్లు చేసి మందులు సరిగా చేసుకుంటున్నారా? లేదా? ఆరోగ్యం ఎలా ఉంది? తదితర వివరాలను తెలుసుకోనున్నారు.