RT-PCR పరీక్ష కూడా అంతంతేనా..! మ్యుటేషన్ కరోనా రకాలు అంతుచిక్కడం లేదట.. కొత్త లక్షణాలతో కోవిడ్ మహమ్మారి.?
RT-PCR test : కరోనా వైరస్ నిర్ధారణలో RT-PCR పరీక్ష ప్రామణికమని ఇంతకాలం భావిస్తూ వస్తున్నాం. అయితే, మ్యుటేషన్‌కు గురైన కరోనా రకాలు ఆర్టీ-పీసీఆర్ పరీక్షకు కూడా దొరకడం లేదని తెలుస్తోంది. డబుల్, ట్రిపుల్ మ్యుటేషన్లకు గురైన వైరస్‌ల విషయంలో ఇలా జరుగుతోందని అనుకుంటున్నామని యురోపియన్ యూనియన్ ప్రిన్సిపల్ మెడికల్ అడ్వైజర్ డా. సౌరదీప్త చంద్ర కొత్త బాంబు పేల్చారు.
కొత్త రకం కరోనా మ్యుటేషన్లతో కొత్త లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఒళ్లు నొప్పులు, గొంతు గరగర, జ్వరం, రుచి-వాసన కోల్పోవడం కోవిడ్ లక్షణాలుగా ఉండేవి. ఇప్పుడు వీటితోపాటు అదనంగా డయేరియా, కడుపు నొప్పి, దద్దుర్లు, కంజంక్టివైటిస్, గందరగోళ మానసిక స్థితి, బ్రెయిన్ ఫాగ్, నీలి రంగులో మారిన చేతి వేళ్లు, కాలి వేళ్లు, ముక్కు నుంచి, గొంతు నుంచి రక్తస్రావం వంటి కొత్త లక్షణాలు కూడా కనిపిస్తున్నాయట