టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. ఎలాగైనా నిర్వహిస్తామని ఏపీ సర్కార్ అంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ పది, ఇంటర్ పరీక్షలపై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, ఇది లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశామని హై కోర్టు పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఏపీ సర్కార్ పునరాలోచించాలని తెలిపింది. పక్క రాష్ట్రాలలో పరీక్షలు వాయిదా వేస్తే.. మీరు ఎలా నిర్వహిస్తారని హై కోర్టు ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్ ను హై కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 3 కు హై కోర్టు వాయిదా వేసింది

Flash...   కరోనాపై సవాలక్ష డౌట్లు... కంట్రోల్ రూమ్ ఏర్పాటు... ఏం అడుగుతున్నారంటే