పరీక్షల నిర్వహణపై నేడు సీఎం సమీక్ష : విద్యాశాఖ మంత్రి సురేష్‌

 కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, ఇతర అంశాలపై సీఎం శుక్రవారం సమీక్షిస్తారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు ఇంకా సమయం ఉందన్నారు. వచ్చేనెల 5 నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ మరో రెండ్రోజుల్లో పూర్తవుతాయన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కొవిడ్‌-19 మార్గదర్శకాలు బాగా అమలవుతున్నాయన్నారు. 

ప్రైవేటు విద్యాసంస్థల్లోనే అమలు సవ్యంగా లేదన్నారు. ఇప్పటికే 1-9 తరగతులకు పరీక్షలు రద్దు చేసినట్లు వెల్లడించారు. విద్యా సంవత్సరాన్ని కాపాడే ప్రయత్నాన్ని కూడా రాజకీయం చేసేలా నారా లోకేశ్‌ చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కాదని మండిపడ్డారు. ఎక్కడో హైదరాబాదులో ఉంటూ ఏపీ విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఎవరో పరీక్ష రాస్తే.. లోకేశ్‌ స్టాన్ఫోర్డ్‌ డిగ్రీ పొందారని విమర్శించారు. కరోనా తీవ్రత దృష్ట్యా సీఎం తిరుపతి ఉప ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనలేదన్నారు.

Flash...   రూ.5 వేల పెట్టుబడితో రూ.5.50 లక్షలు.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌!