బ్రేకింగ్‌: తెలంగాణ‌లో టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దు

ఇప్ప‌టికే సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయం తీసుకోవ‌డంతో.. అదేదారిలో తెలంగాణ ప్ర‌భుత్వం అడుగులు వేసింది.. ఎస్ఎస్‌సీ బోర్డు ఎగ్జామ్స్​ ను ర‌ద్దు చేసింది.. ఇదే స‌మ‌యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది.. రాష్ట్రంలో టెన్త్ విద్యార్థులు 5.2 లక్షల మంది, ఇంట‌ర్ ఫస్టియర్ విద్యార్థులు నాలుగున్నర లక్షల మంది వరకు ఉన్నారు. ఇంటర్ కు మే1 నుంచి 20 వరకు, టెన్త్ విద్యార్థులకు మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వ‌హించాల్సి ఉండ‌గా.. కరోనా సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో, పరీక్షల నిర్వ‌హ‌ణ‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది స‌ర్కార్. ఇవాళ జ‌రిగిన ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకోగా.. ఇవాళే ఉత్త‌ర్వులు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. 

మ‌రోవైపు, క‌రోనా ఎఫెక్ట్‌తో గ‌త నెల 24వ తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రభుత్వం మూసివేసింది. ఫస్టియర్ విద్యార్థులకు ఈనెల1న జరగాల్సిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఈనెల 3న జరగాల్సిన ఎన్విరాన్​మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఇంటి నుంచి రాసి పంపించే అకాశాన్ని క‌ల్పించింది.. ఇక‌, ఈనెల 7 నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ మే 29 నుంచి జూన్ 7 వరకు ఉంటాయని ఇప్ప‌టికే ప్రకటించింది. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలు ఉత్కంఠ నెల‌కొన‌గా.. ఆ ఉత్కంఠ‌కు తెర‌దించుతూ.. పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ.. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణ‌యాన్నే ఫాలో కావాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది.

Flash...   11న నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌!