రేపట్నుంచి రాత్రి కర్ఫ్యూ.. సీఎం జగన్ సంచలనం

 

ఆంధ్రప్రదేశ్‌లో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం మంత్రులు, అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఖర్చుతోనే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇక, రాష్ట్రంలో 18- 45 ఏళ్ల మధ్య వయసున్న వారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారు. వీరందరికి ఏపీ సర్కార్‌ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వనుంది.

కాగా, ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ సరఫరా విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భారత్‌ బయోటెక్‌, హెటెరో డ్రగ్స్‌ ఎండీలకు ఫోన్‌ చేసి మాట్లాడారు. రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా మరిన్ని కోవిడ్‌ వాక్సిన్‌ డోస్‌లతో పాటు, రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు సరఫరా చేయాలని కోరారు. వారితో మాట్లాడిన అనంతరం రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు

ఇక, ఏపీలో శనివారం నుంచి నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఏపీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటికే 45 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ రూ.1600 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి ఆళ్లనాని తెలిపారు. వైద్య పరీక్షలకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కరోనా కట్టడిపై సీఎం జగన్‌ విస్తృతంగా చర్చించారని ఆళ్లనాని తెలిపారు. వ్యాక్సిన్‌ను ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆళ్లనాని అన్నారు.

Flash...   600 Posts in IDBI Bank: నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగం.. వార్షిక వేతనం రూ.6.5 లక్షలు