విద్యార్థుల‌కు సీఎం Y S జ‌గ‌న్ GOOD NEWS

 విద్యార్థుల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లోకి డ‌బ్బులు. 

విద్యాదీవెన కింద విద్యార్థులకు ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ అందించ‌నున్నారు.

విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్పారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. రేపు జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థులకు ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ అందించ‌నున్నారు.. 

తాడేప‌ల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా నేరుగా విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లో డ‌బ్బు జ‌మ చేయ‌నున్నారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. 2020-21 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 10.88 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ సొమ్మును బ‌దిలీ చేయ‌నున్నారు.. మొత్తంగా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కు రూ.671.45 కోట్లు కేటాయించిన జ‌గ‌న్ స‌ర్కార్.. నేరుగా వారికి విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లోనే ఆ సొమ్మును జ‌మ చేయ‌నున్నారు. 

ఇక‌, ఇప్పటి వరకు మొత్తం రూ.4,879 కోట్లను జ‌గ‌న‌న్న‌ విద్యాదీవెన ప‌థ‌కం కింద జ‌మ‌చేసింది ఏపీ ప్ర‌భుత్వం.. ఇక‌, ఈ నెల 28న వసతి దీవెన మొదటి విడ‌త కూడా జ‌మ చేయ‌నున్నారు

Flash...   SONU SOOD: ఇంటికే ఆక్సిజ‌న్ ఇస్తాం.. సోనూసూద్ కీల‌క నిర్ణ‌యం