విద్యాలయాలన్నింటికీ సెలవులు ప్రకటించాలి

 


రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో సీపీఎం

అమరావతి, ఆంధ్రప్రభః రాష్ట్రంలో మరోసారి కరోనా వ్యాధి విజృంభిస్తున్న పరిస్థితుల్లో విద్యాలయాలన్నింటికీ సెలవులు ప్రకటించాలని, పది, ఇంటర్తో సహా అన్ని పరీక్షల ను వెంటనే వాయిదా వేయాలని, పరిస్థితి అదుపు లోకి వచ్చాక పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని సీపీఎం ప్రభుత్వానికి సూచించింది. బుధవారం సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు వై. వెంకటేశ్వరావు అధ్యక్షతన ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శాఖలు అప్రమతంగా ఉంటూ స్థానికంగా ఎక్కడిక్కడ ప్రజలకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 

ఇప్పటికే ఉపాధి పోయి, ఆదాయాలు తగ్గి నానా యాతన పడుతున్న ప్రజానీకం మరోసారి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని, ప్రజల్ని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను అరికట్ట డంలో, వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించడంలో విఫలమ య్యాయన్నారు. . మరణాల సంఖ్య కూడా అసా ధారణంగా పెరుగుతోందని, గతం కన్నా వ్యాధి తీవ్రత పెరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఆందోళన వ్యక్తం చేశారు. టెస్ట్ చేసిన వెంటనే 24 గంటల్లోగా ఫలితాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సేవలను ఉపయోగించుకొని రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల కు తగినంత నిల్వలుండే విధంగా ఆక్సిజన్ సరఫరా చేయా లని కోరారు. ఉపాధి కూలీలకు పనితో నిమిత్తం లేకుండా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

Flash...   ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీనిచ్చే బ్యాంకులు ఇవే.. ఏకంగా 9.5శాతం వడ్డీ.. వివరాలు ఇవి..