సోషల్ మీడియా వేదికలను కొన్ని గంటల పాటు సస్పెండ్ చేసింది పాకిస్థాన్.. దీనికి కారణం.. పాక్‌లో ఫ్రాన్స్ వ్యతిరేక నిరసనలు పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారడమే.. ఈ ఘటనలు సోషల్ మీడియాకు ఎక్కి.. మరికొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావించిన పాక్ సర్కార్.. సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్, వాట్సాప్, టెలిగ్రాం వంటి వాటిని కొన్ని గంటల పాటు సస్పెండ్ చేస్తూ పాక్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ) నిర్ణయం తీసుకుంది.. అయితే, ఇవి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి యథావిథిగా పనిచేస్తున్నట్టు పాక్ మీడియా పేర్కొంది.
కాగా, మహ్మద్ ప్రవక్తపై ఓ మ్యాగజైన్ కార్టూన్ల ప్రచురణను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రన్ సమర్థించడంతో.. పాకిస్థాన్‌లో నిరసన కార్యక్రమాలు జరిగాయి.. అవికాస్తా అల్లర్లకు దారితీశాయి.. హింసాత్మక నిరసనలతో ఉద్రిక్తత నెలకొన్న క్రమంలో దేశీయాంగ మంత్రిత్వ శాఖ సూచనలతో.. టెలికమ్యూనికేషన్స్ అధికారులు వెంటనే సోషల్ మీడియా వేదికలను సస్పండ్ చేశారు.. నిరసనలు తగ్గుముఖం పట్టడంతో. మళ్లీ అన్ని యథావిథిగా పనిచేస్తున్నాయి