AP లో పరీక్షల నిర్వహణపై ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు

 

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాబోయే రోజుల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. అప్పటి వరకు షెడ్యూల్‌ ప్రకారం యథాతథంగా జరుగుతాయని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నామని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది రానివ్వబోమని తెలిపారు

Flash...   Home Loan Insurance: హోమ్ లోన్ తీసుకునేటప్పుడు కచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలా ?