Don’t attempt Exam with Covid positive – Suresh

పాజిటివ్ ఉంటే పరీక్ష రాయొద్దు

కోవిడ్ సర్టిఫికెట్ ఇస్తే సప్లిమెంటరీని కూడా రెగ్యులర్  గా   పరిగణన

ప్రతి కేంద్రంలో పారామెడికల్ వైద్య సిబ్బంది సేవలు 

స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన చర్యలు

అమరావతి, ఆంధ్రప్రభ

రాష్ట్రంలో విద్యార్థుల భవిష్య త్తుమ దృష్టిలో పెట్టుకుని ఇంటర్మీడియట్ పరీక్షల 5 నుంచి 19 వరకు నిర్వహిం వేందుకు అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని  విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ పేర్కొ న్నారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ భవన సము దాయంలో గురువారం ఆయన విలేకరుల సమా వేశం నిర్వహించారు. ఏ రాష్ట్రంలోనూ పరీక్షలు రద్దు చేయలేదని, అయినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా రాజకీయం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేవ లం పాస్ సర్టిఫికెట్లతో ఉన్నత చదువులకు భవిష్యతు లో పోటీపడడం చాలా కష్టమని, అందుకే పరీక్షల నిర్వహణ చేపడుతున్నామని తల్లిదండ్రులకు, విద్యా ర్ధులకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. పరీక్షలు నిర్వ హించకపోతే ఎంతో కష్టపడి చదివినా చివరిమెట్టు దగ్గర చతికిలపడినట్లు వారి భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి సూచనల మేరకు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అత్యంత కట్టుదిట్టమైన వ్యవస్థతో పరీక్షల నిర్వహణ కు అడుగులు వేశామన్నారు. గతంలో 1,411 కేంద్రా లతో పరీక్షలు నిర్వహించామని, ఈఏడాది 11 అదన పకేంద్రాలతో 1,452 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తు న్నామని మంత్రి వివరించారు. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు మే5, 7, 10, 12, 15, 18 తేదీల్లో, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మే 6,8, 11, 13, 17, 19 తేదీల్లో నిర్వహిస్తున్నామని తెలి పారు. మే 9 10 ఆదివారాలు, మే 14వ రంజాన్ సందర్భంగా పరీక్షలు నిర్వహించడం లేదన్నారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు జవాబు పత్రాలు చేరా యని, ప్రశ్నాపత్రాలు కూడా జిల్లా కేంద్రం నుంచి ఆయా కేంద్రాలకు చేరేందుకు సిద్ధంగా ఉంచామని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికం గా 146 కేంద్రాలు ఉండగా, గుంటూరు జిల్లాలో అత్యల్పంగా 60 కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయ న్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు, పర్యవేక్షించేందుకు 13 మంది కోవిడ్ స్పెషల్ ఆఫీసర్లతో పర్యవేక్షణ జరుపుతున్నామన్నారు. కోవిడ్ లక్షణాలుంటే వారికి ప్రత్యేక ఐసోలేషన్ గదిలో పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్దా ప్రతి రోజూ థర్మల్ స్కానింగ్తో పరీక్షించడంతో పాటు, సోడియం హైపోక్లోరైడ్తో శానిటేషన్ చేస్తా మని వివరించారు.

Flash...   మొబైల్ కు బ్యాక్ కవర్ వేస్తున్నారా.. మీ మొబైల్ ఫసక్.. ఎందుకంటే..?

కోవిడ్ విద్యార్థులకు ప్రత్యేక సప్లిమెంటరీ కోవిడ్తో బాధ పడుతున్న విద్యార్థులకు ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తామని మంత్రి డా. ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇందుకు కోవిడ్ పాజిటివ్ ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంద న్నారు. వీరికి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షల ఉత్తీర్ణ తా ఫలితాలు రెగ్యులర్ విద్యార్థులకు జారీ చేసేవే జారీ ఉంటాయని స్పష్టం చేశారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్క 13 పైగా విద్యార్ధులు హాజర య్యారని లక్షల మందికి గుర్తు చేశారు.