e-PAN Card: ఇ-పాన్ కార్డ్ 10 నిమిషాల్లో తీసుకోవచ్చు

 మీరు పాన్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా? 10 నిమిషాల్లో ఇ-పాన్ కార్డ్
తీసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.

1. మీ దగ్గర పాన్ కార్డ్ లేదా? ముఖ్యమైన లావాదేవీల కోసం పాన్ కార్డ్ అవసరమా?
గతంలోలాగా పాన్ కార్డ్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. వెంటనే
పాన్ కార్డ్ తీసుకోవచ్చు. కేవలం 10 ఇ-పాన్ కార్డ్ తీసుకోవచ్చు.

2. ఇన్‌స్టంట్‌గా పాన్ కార్డు ఇచ్చే సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం గతేడాది
ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ టెక్నాలజీ ద్వారా 10 నిమిషాల్లో ఇ-పాన్ కార్డ్
తీసుకోవచ్చు. అత్యవసరంగా పాన్ కార్డ్ కావాల్సినవారికి ఈ సర్వీస్ బాగా
ఉపయోగపడుతుంది.

3. గతంలో పాన్ కార్డ్‌కు దరఖాస్తు చేస్తే రెండు వారాల తర్వాత వచ్చేది. అయితే
ఇన్‌స్టంట్ పాన్ కార్డ్ తీసుకోవాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్
కార్డు డేటా ద్వారా పాన్ కార్డ్ జారీ చేస్తుంది ఆదాయపు పన్ను శాఖ.

4. కేవలం 10 నిమిషాల్లో మీకు ఇ-పాన్ కార్డ్ జారీ అవుతుంది. ఆ తర్వాత ఫిజికల్
పాన్ కార్డ్ మీరు కోరుకున్న అడ్రస్‌కు పోస్టులో వస్తుంది. అయితే గతంలో పాన్
కార్డు లేనివారికి మాత్రమే ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది.
  

5. అంటే వారి దగ్గర పాన్ కార్డు లేదు కాబట్టి వెంటనే పాన్ కార్డు
తీసుకోవడానికి ఇన్‌స్టంట్ పాన్ కార్డ్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. మరి ఇన్‌స్టంట్
పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.

6. ముందుగా https://www.incometaxindiaefiling.gov.in/ ఓపెన్ చేయాలి. ఇది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇ-ఫైలింగ్ పోర్టల్. ఇందులో
ఇన్‌స్టంట్ పాన్ కార్డ్ పొందొచ్చు. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎడమవైపు
Quick Links కనిపిస్తుంది.

7. అందులో Instant PAN through Aadhaar లింక్‌పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీలో
అందులో Get New PAN పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Generate Aadhaar OTP పైన క్లిక్ చేయాలి.

Flash...   JOB MELA: 11న AP లో జాబ్ మేళా.. రూ.35 వేల వరకు జీతం.. ఇలా నమోదు చేసుకోండి

8. మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ
వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ వివరాలు ఓసారి చెక్ చేసుకోవాలి.
మీ ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. చివరగా సబ్మిట్ చేసిన తర్వాత 15 అంకెల
అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది.

9. వెరిఫికేషన్ పూర్తైన తర్వాత పాన్ కార్డు జారీ అవుతుంది. ఆదాయపు పన్ను శాఖ
UIDAI దగ్గర రిజిస్టర్ అయిన మీ ఆధార్ వివరాల ద్వారా పాన్ కార్డు జారీ
చేస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం కేవలం 10 నిమిషాల్లో పూర్తవుతుంది. Check Status/
Download PAN పైన క్లిక్ చేసి మీ ఇ-పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

10. మీ ఇ-పాన్ కార్డు పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీ ఇమెయిల్ ఐడీకి వస్తుంది.
ఇన్‌స్టంట్ పాన్ కార్డును మీరు ఒరిజినల్ పాన్ కార్డులాగానే ఉపయోగించుకోవచ్చు.
ఆర్థిక లావాదేవీలతో పాటు ఐడీ ప్రూఫ్‌గా చూపించొచ్చు
.

 చివరిగా ఇంపార్టెంట్ స్టెప్

డౌన్లోడ్ ఐన పిడిఎఫ్ PAN కార్డు ఓపెన్ చెయ్యాలంటే పాస్వర్డ్ అడుగుతుంది

PASSWORD: మీ పుట్టిన తేదీనే

ఉదాహరణకి మీ పుట్టిన తేదీ 01-12-1990 అయితే PASSWORD ని
01121990 గా ఎంటర్ చెయ్యాలి.