LIC Paytm: LIC డిజిటల్‌ చెల్లింపుల కోసం PAYTM తో ఒప్పందం

 LIC Paytm: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త… డిజిటల్‌ చెల్లింపుల కోసం
పేటీఎంతో ఒప్పందం.

కరోనా విజృంభణతో అంతా డిజిటల్‌ చెల్లింపులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్ని
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ కస్టమర్లకు డిజిటల్‌ సర్వీసులను అందిచేందుకు
మొగ్గు చూపుతున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) డిజిటల్‌ చెల్లింపుల కోసం పేటీఎంతో ఒప్పందం
కుదుర్చుకుంది. దీంతో ఎల్‌ఐసీ పాలసీదారులు నేరుగా తమ పాలసీ అమౌంట్‌ను పేటీఎం
ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుంది. పాలసీదారులకు విస్తృత శ్రేణి డిజిటల్‌
చెల్లింపుల సేవలను అందించాలనే ఉద్దేశంతో పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు
ఎల్‌ఐసీ తెలిపింది. కాగా, ఎల్‌ఐసీ ఇంతకు ముందే పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే అప్పుడు అన్ని పేమెంట్స్‌ ఆప్షన్‌ అందించలేదు. కానీ ప్రస్తుతం
కుదుర్చుకున్న ఒప్పందంతో అన్ని పేమెంట్‌ ఆప్షన్స్ డిజిటల్‌ మోడల్‌లకు మార్చింది.

ప్రస్తుతం ఎల్‌ఐసీ ప్రీమియంలను పేటీఎం ద్వారా చెల్లించేందుకు వివిధ బ్యాంకుల
యూపీఐ ఛానెల్‌ను లేదా వాలెట్లను ఉపయోగించుకోవచ్చు. అయితే దాదాపు 17 చెల్లింపు
ప్లాట్‌ఫామ్‌లు ఎల్‌ఐసీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి వేలంలో పాల్గొనగా, చివరకు
పేటీఎం ఈ అవకాశాన్ని దక్కించుకుంది. 2020లో కరోనా తర్వాత డిజిటల్‌ చెల్లింపులు
పెరిగాయని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది.

కరోనా మహమ్మారి సమయంలో రూ.60 వేల కోట్ల విలువైన ప్రీమియంలను ఒక్క డిజిటల్‌ మోడ్‌
ద్వారానే పాలసీదారుల నుంచి వసూలు చేసింది. కాగా, ఎల్‌ఐసీ ప్రస్తుతం ఎనిమిది కోట్ల
పాలసీదారులను కలిగి ఉంది. వారందరికీ డిజిటల్‌ సేవలు అందించాలనే ఉద్దేశంతోనే
పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. దేశంలో కరోనా ఉధృతి మరింత
పెరుగుతుండటంతో ఎల్‌ఐసీ పాలసీదారుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.

కరోనాతో పెరిగిన డిజిటల్‌ లావాదేవీలు

ఇదిలా ఉండగా, కరోనాతో ఎల్‌ఐసీ డెత్‌ క్లామ్‌లు కూడా భారీగా పెరిగిపోయాయి.
రెగ్యులేటరీ సంస్థ ఐఆర్‌ డీఏకు ఎల్‌ఐసీ ఇటీవల అందించిన డేటా ప్రకారం.. గత ఏడాది
ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య డెత్‌ క్లాయిమ్‌లు 8 లక్షలను దాటాయి. అంతకు ముందు
ఏడాదిలో ఇదే కాలంతో పోలిస్టే డెత్‌ క్లెయిమ్‌లు 21 శాతం మేర పెరిగాయి. ఇంత తక్కువ
కాలంలో భారీ ఎత్తున డెత్‌ క్లాయిమ్‌లు రావడంతో ఎల్‌ఐసీ చరిత్రలో ఇదే మొదటిసారని
కంపెనీ వర్గాలు తెలిపాయి. కరోనాతో చాలా మంది మృత్యువాత పడుతుండటంతో డెత్‌
క్లెయిమ్‌ల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని ఎల్‌ఐసీ చెబుతోంది. ఇవన్నీ
ఫస్ట్‌వేవ్‌ కేసులేనని, సెకండ్‌ వేవ్‌లో డెత్‌ క్లెయిమ్‌ కేసులు మరింగా పెరిగే
అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Flash...   Tax Saving FDs: ఎఫ్‌డీపై వడ్డీతోపాటు ట్యాక్స్ బెన్ఫిట్.. ఏ బ్యాంకులో ఇస్తున్నారో తెలుసా!