తెలంగాణలో టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ, ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. ఇప్పటికే సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దయ్యాయి. ఇదే తరుణంలో రాష్ట్రంలో కూడా పరీక్షలను రద్దు చేసేందుకే మొగ్గు చూపిన సర్కార్.. కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో 5.35 లక్షల మంది టెన్త్ విద్యార్థులు ఉండగా.. వీరందరినీ పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. దీంతో.. మే 17వ తేదీ నుండి జరగాల్సిన టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఎస్ఎస్‌సీ బోర్డు విద్యార్థుల ఫలితాలను ప్రకటించనుంది. బోర్డు వెల్లడించిన ఫలితాలతో సంతృప్తి చెందని ఎవరైనా విద్యార్థులు పరిస్థితుల అనుకూల అనంతరం వ్యక్తిగతంగా పరీక్షలు రాయొచ్చని స్పష్టం చేసింది ఎస్ఎస్‌సీ బోర్డు.
ఇతర అంశాల ను ప్రాతిపదికగా తీసుకొని 10వ తరగతి పలితాలు ప్రకటించనున్నారు.. ఫార్మటివ్ అస్సెస్మెంట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ ఇవాళ లేక గత ఏడాది అందరు విద్యార్థులను పాస్ చేసినట్టు చేయాలా అనే అంశాలని పరిశీలిస్తోంది విద్యా శాఖ.. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.. మరోవైపు.. ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజ్ కూడా ఉండబోదని స్పష్టం చేశారు.. ఇక, ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు వాయిదా వేయగా.. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు బాక్ లాగ్స్ ఉంటే వారికి పరీక్ష నిర్వహించకుండానే మినిమం పాస్ మార్కులు వేసేలా నిర్ణయం తీసుకున్నారు.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల పై జూన్ మొదటి వారంలో సమీక్ష నిర్వహించిన నిర్ణయం తీసుకోనున్నారు.. పరీక్షలకు 15 రోజుల ముందే విద్యార్థులకు సమాచారం ఇవ్వనున్నారు.