ఎయిడెడ్ ఉపాధ్యాయులు ప్రభుత్వంలోకి!

మంత్రివర్గ సమావేశం ముందుకు చట్ట సవరణ అంశం.

ప్రస్తుతం ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వంలోకి తీసుకుంటా మని పాఠశాల విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సౌకర్యాలను కల్పించాలని సుఘాలు కోరగా ఆమోదించారు. జిల్లా యూనిట్ విలీనం చేస్తామని, ఏ పోస్టులో ఉంటే అదే పోస్టులు ఇస్తామని పేర్కొన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయ సంఘాలు విద్యాసంస్థల యాజమాన్యాలతో గురువారం నిర్వహించిన సమావేశంలో విద్యా శాఖ అధికారులు ఈ మేరకు హామీ ఇచ్చారు. 

ఎయిడెడ్ విద్యా సంస్థల చట్ట సవరణకు సంబంధించిన అంశం ఈనెల 28న జరగనున్న మంత్రివర్గ సమావేశం ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్తులతో సహా విద్యా సంస్థలను ప్రభుత్వానికి అప్పగించేందుకు 16 యాజమాన్యాలు ముందుకొచ్చాయి. మరో 18 పాఠశాలలు ఉపాధ్యాయులు, సిబ్బందిని ఇచ్చేం దుకు అంగీకరించినట్లు తెలిసింది. ఎయిడెడ్ బోధన, బోధనేతర సిబ్బంది కలిపి 6,800. మంది ఉన్నారు.ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో పనిన చేస్తున్న వారు సుమారు 1317 మంది వరకు ఉన్నారు.

Flash...   Siyaram launches anti-corona fabric which 'destroys COVID-19 virus in seconds