ఏపీలో పదో తరగతి పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతథం – ఆదిమూలపు సురేష్

1 నుండి 9 వ తరగతి వరకు రేపటి నుండి సెలవులు. 

పదో తరగతి పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతథం.

 ఏపీలో పదో తరగతి పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని,
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అయితే కరోనా కారణంగా ఒకటి నుంచి
9వ తరగతి పాఠశాలల మూసివేస్తున్నామని అన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల
షెడ్యూల్ ఇప్పటికే మొదలైందని అందుకే ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు
యథాతథంగా జరుగుతాయని అన్నారు. 

నిజానికి కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను ఇప్పటికే రద్దు
చేస్తున్నట్లు ప్రకటించింది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు
వెల్లడించింది. నీట్ పీజీ 2021 పరీక్ష సైతం కేంద్రం వాయిదా వేసింది. తెలంగాణలో ఈ
సారి టెన్త్ ఎగ్జామ్స్ ను సర్కారు రద్దు చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు
ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్టు ప్రకటించింది. సెకండ్ ఇయర్
పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అయితే ఏపీ మాత్రం పరీక్షలు
నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది. 

Flash...   Interim order on GO MS 54