ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు

అమరావతి: ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ ప్రతిరోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. మున్ముందు కోవిడ్ కేసులు పెరిగితే అప్పుడు పరీక్షల నిర్వహణపై ఆలోచిస్తామని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్‌తో సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై చర్చిస్తామన్నారు. ఇప్పటికయితే యథావిథిగా షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు జరిపే ఆలోచనలో ఉన్నామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

Flash...   KSS PRASAD INCOME TAX SOFTWARE 2022-23