కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోబ్రియాల్ నిషాంక్ కరోనా

 

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోబ్రియాల్ నిషాంక్ కరోనా బారిన పడ్డారు. తనకు నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలిందని బుధవారం ఆయన వెల్లడించా రు. 


ఇటీవల తనకు సమీపంగా మెలిగిన వారంతా వైద్య పరీక్షలు చేయించు కోవాలని కోరారు. ట్విటర్ వేదికగా పోబ్రియాల్ స్పందిస్తూ.. ‘నాకు కొవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం చికిత్స తీసు కుంటున్నాను. ఇటీవల నన్ను కలుసుకు న్న వారంతా స్వచ్చందంగా పరీక్షలు చేయించుకోవాలని, కొద్ది రోజుల పాటు హోమ్ క్వారెంటైన్లో ఉండండని కోరు తున్నాను.. ” అని పేర్కొన్నారు. 

కాగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాశాఖ కార్యకలాపాలను యధాతథంగా కొన సాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

Flash...   GIRL STUDENTS MISSING: కలకలం..ఏపీలో నలుగురు పదో తరగతి విద్యార్థినీల అదృశ్యం