టెన్త్ ఇంటర్ పరీక్షల పై ఈ రోజే కీలక నిర్ణయం

 

అమరావతి: సెకండ్‌ వేవ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. రోజురోజుకూ ఇటు వైరస్‌బారిన పడుతున్నవారితో పాటు మరణాల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు ఈ రోజే మంత్రివర్గ ఉససంఘం భేటీ కానుంది. మంత్రి ఆళ్ల నాని సారథ్యంలో రాష్ట్రంలో కొవిడ్‌ నివారణ, పర్యవేక్షణ, వ్యాక్సినేషన్‌పై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్‌ లభ్యత, వైద్య నిపుణుల నియామకం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

మరియు 10 వ తరగతి ,ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశం పైనా.. రాష్ట్రంలో ఆంక్షల విధింపు అంశంపైనా చర్చించనున్నట్లు సమాచారం.

Flash...   ICT Survey FORM for students of High Schools