వాట్సాప్‌ యూజర్లకు హెచ్చరిక… పింక్‌ వాట్సాప్‌తో జాగ్రత్త

 

నేటి కాలంలో వాట్సప్ వినియోగం ఎంత పెరిగిపోయిందో అందరికీ తెల్సిందే. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, లొకేషన్ సహా ప్రతి ఒక్కటి ఇతరులకు షేర్ చేయడానికి అత్యధికంగా వాట్సాప్‌నే వాడుతున్నారు. అయితే వాట్సాప్‌లో కూడా కొన్ని ఫేక్ లింక్స్, మెసేజ్ లు రావడం సాధారణంగా మారింది. అయితే వినియోగదారులు ఇలాంటి ఫేక్ లింక్స్, మెసేజ్ ల నుంచి అప్రమత్తంగా ఉన్నప్పుడే వారి సమాచారం సురక్షితంగా ఉంటుంది. లేకుంటే సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లి ఇబ్బందులు తప్పవు.

అయితే తాజాగా మరో ఫేక్‌ లింక్‌ ఇప్పుడు వాట్సాప్‌లో వైరల్‌ అవుతోంది అదే పింక్‌ వాట్సాప్‌. ఈ పింక్‌ వాట్సాప్‌ లింక్ కూడా వాట్సాప్‌ లింక్‌నే పోలి ఉంటుంది. అయితే ఈ లింకులు క్లిక్‌ చేస్తే వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని చెబుతూ ఈ లింక్ ను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. అది నమ్మి ఎవరైనా ఆ లింక్ పై క్లిక్ చేస్తే ముప్పు తప్పదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే పింక్‌ వాట్సాప్‌కి అసలు వాట్సాప్‌కి ఎలాంటి సంబంధం ఉండదు. పొరపాటున పింక్‌ వాట్సాప్‌ లింక్ పై క్లిక్ చేస్తే డాటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లడం ఖాయమని చెబుతున్నారు.

కాగా వాట్సాప్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ అయినా ప్లే స్టోర్‌లో యాప్‌ నుంచే ఉంటుందని సైబర్ నిపుణులు అంటున్నారు. ఇలాంటి ఫేక్ లింక్స్ నమ్మితే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవడం లేదా పర్సనల్ డేటా చోరీ అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటికే ఫేక్‌ లింక్‌ను ఇప్పటికే క్లిక్‌ చేసి ఉన్న వారు తమ ఫోన్‌ను రీసెట్‌ చేయడం మంచిదని, అలానే మెయిల్‌ ఐడీ, బ్యాంకు ఖాతాలు, సోషల్‌ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లు మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు.

Flash...   విద్యాహక్కు చట్టం : పదేళ్ల నుంచి ఏం చేస్తున్నారు ?