ఏపీలో కరోనా చికిత్సలపై హైకోర్టు అసంతృప్తి

 


ఏపీలో కరోనా చికిత్సలపై హైకోర్టు అసంతృప్తి.. ప్రభుత్వంపై ఆగ్రహం.
 

ఆంధ్రప్రదేశ లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అఫిడవిట్ లో దాఖలు చేసిన దానికి.. క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న విధానావకు పొంతనలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని గత అఫిడవిట్లో పేర్కొన్నా.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని తెలిపింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు దొరకడం లేదని నోడల్ అధికారులే బదులివ్వడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పద్ధతి మార్చుకోకుంటే సీఎస్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనాకు సరైన చికిత్సలు అందడం లేదంటూ సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు, ఏపీసీఎల్ఏ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టు వివరించారు. అదే సమయంలో వాస్తవ పరిస్థితిని అమికస్ క్యూరీ కోర్టుకు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స అందించేందుకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. హోం ఐసోలేషన్లో ఉన్నవారికి 104, 1902 ద్వారా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తోంది. అలాగే కొవిడ్ కేర్ సెంటర్లు, కొవిడ్ ఆస్పత్రుల్లో వేలాది మందికి ట్రీట్ మెంట్ ఇప్పిస్తోంది. ఐతే ఆక్సిజన్ లభ్యత విషయంలో మాత్రం కాస్త గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. పలుజిల్లాల్లో కొవిడ్ పేషెంట్లు ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు వస్తున్నవార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Flash...   Medical Reimbursement Claim of employees and Pensioners - Instructions