మరో 10 రోజులు పాటు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం

 

క‌రోనా రోజువారి కొత్త కేసుల న‌మోదు సంఖ్య త‌గ్గినా.. ఇంకా భారీగానే వెలుగు చూస్తుండ‌డంతో.. మ‌రోసారి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది ఏపీ స‌ర్కార్.. కరోనా కట్టడి కోసం విధించిన కర్ఫ్యూను మ‌రోసారి పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.. మే 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఆంక్షలు.. ఇవాళ్టితో ముగియ‌నుండ‌గా.. మరో 10 రోజులు పాటు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్ర‌భుత్వం.. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ అవసరాల నిమిత్తం స‌డ‌లింపులు ఉండ‌గా.. ఆ స‌మ‌యాన్ని కూడా య‌థాత‌థంగా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

Flash...   Income Tax: రామాంజనేయులు ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్ వేర్ 2023-24 తో మీ టాక్స్ ఎంతో లెక్కించండి