మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ ఎవరు చూస్తున్నారో తెలుసుకోవాలనుందా? ఇలా చేయండి

ఫేస్ బుక్ ప్రొఫైల్ ఎవరెవరు చూస్తునారో తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. మనకు తెలియకుండా చాలామంది మీ ప్రొఫైల్ ని చూసి ఉంటారు. మీ వివరాలు కనుక్కుని ఉంటారు. వాళ్ళెవరో మీకు తెలియదు. ఫేస్ బుక్ లో మీ ప్రొఫైల్ ఎవరు చూసారో తెలుసుకునే డైరెక్ట్ ఆప్షన్ ఉండదు. అదే ఐఫోన్లలో అయితే తెలుసుకునే అవకాశం ఉంది. అవును, ఐఫోన్ వాడేవాళ్ళందరూ తమ ఫేస్ బుక్ ప్రొఫైల్ ఎవరు చూసారో ఈజీగా తెలుసుకోవచ్చు. వారి ప్రైవసీ సెట్టింగ్స్ కి వెళ్ళి ఎవరెవరు చూసారనే విషయం క్లియర్ గా చూడవచ్చు.

2018లో ఫేస్ బుక్ యాజమాన్యం ఐఫోన్ వాడేవాళ్ళకి ఈ అవకాశాన్ని కల్పించింది. దీని కోసం వారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రైవసీ సెట్టింగ్స్ కి వెళ్ళి, “Who viewed my profile” అనే బటన్ ఆన్ చేసుకుంటే చాలు. ఎప్పటికప్పుడు ఎవరు చూసారన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. అదే ఆండ్రాయిడ్ యూజర్స్ తెలుసుకోవాలంటే మాత్రం డెస్క్ టాప్ లో ఫేస్ బుక్ పేజీకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి డెస్క్ టాప్ లో ఫేస్ బుక్ పేజీకి లాగిన్ అయ్యాక, హోమ్ బటన్ మీద రైట్ క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.

అప్పుడు వ్యూ పేజి అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. అప్పుడు సెర్చ్ అని వస్తుంది. ఆ ప్లేస్ లో “BUDDY_ID అని టైప్ చేయండి. వెంటనే మీకు 15అంకెలు కలిగిన ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ని కాపీ చేసుకుని కొత్త టాబ్ ఓపెన్ చేసుకుని, facebook.com/profile ID (15-digit code) అని సెర్చ్ చేయండి. అది వెంటనే మీ ఫేస్ బుక్ పేజిని ఎవరైతే సందర్శించారో వారి ప్రొఫైల్ కి తీసుకెళ్తుంది. ఐఫోన్ మాదిరిగా డైరెక్ట్ గా తెలుసుకోలేకపోయినప్పటికీ ఈ విధంగా ఎవరెవరు మన ప్రొఫైల్ చూసారో కనుక్కోవచ్చు. మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకి కూడా డైరెక్టుగా కనుక్కునే అవకాశం ఫేస్ బుక్ కల్పించవచ్చు

Flash...   ఒకే ఒక్కరు రాకపోతే బడికి సెలవు