ఒక డోస్ కోవ్యాక్సిన్ వేసుకుని రెండో డోస్ కోవిషీల్డ్ వేసుకోవచ్చా? వ్యాక్సిన్ల సందేహాలపై నిపుణుల సమాధానాలు..

ఒక డోస్ కోవ్యాక్సిన్ వేసుకుని రెండో డోస్ కోవిషీల్డ్ వేసుకోవచ్చా? వ్యాక్సిన్ల సందేహాలపై నిపుణుల సమాధానాలు..

మొదటి వేవ్ కంటే వేగంగా, ఉధృతంగా, భయంకరంగా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. దీని బారి నుండి కాపాడుకోవడానికి కరోనా నియంత్రణ సూచనలు పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అలాంటి సూచనల్లో భాగమే వ్యాక్సిన్ వేసుకోవడం.

వ్యాక్సిన్లపై చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలన్నింటికీ సమాధానాలు..

ఎన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి?

రెండు. కోవ్యాక్సిన్, కోవిషీల్డ్

ఒక డోసుకి రెండవ డోసుకి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి?

కొవ్యాక్సిన్ అయితే 4 నుండి ఆరు వారాల గ్యాప్ ఉండాలి. అదే కోవిషీల్డ్ అయితే 4-8వారాలు ఉండాలి.

ఒక డోసులో కోవ్యాక్సిన్ తీసుకుని రెండవ డోసుకు కోవిషీల్డ్ తీసుకోవచ్చా?

లేదు. అవును, మొదటి డోస్ ఏది తీసుకున్నారో రెండవ డోసు కూడా అదే తీసుకోవాలి. ఎందుకంటే రెండూ విభిన్నమైనవి కాబట్టి మొదటి డోస్ ఏది తీసుకుంటున్నారో రెండవ డోసు కూడా అదే తీసుకోవాలి.

కోవిడ్ 19 నుండి రికవరీ అయ్యాక ఎన్ని రోజులకి వ్యాక్సిన్ వేయించుకోవాలి?

MOHFW ప్రకారం వ్యాధి లక్షణాలు పూర్తిగా తగ్గిన 14రోజుల తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. కాకపోతే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెప్పిన ప్రకారం, నెగెటివ్ వచ్చిన 90రోజుల తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవాలి.

చాలా తక్కువ లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటే సరిపోతుందా? హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం లేదా?

అవును, స్వల్ప లక్షణాలు కలిగిన వారికి ఇంట్లో క్వారంటైన్ లో ఉంటే సరిపోతుంది. కాకపొతే స్వల్ప లక్షణాలు కలిగి ఉండి, ఇతర వ్యాధులతో పోరాడుతుంటే హాస్పిటల్ కి వెళ్ళాల్సి ఉంటుంది.

వార్తల్లో వస్తున్న ప్రకారం కరోనాని ముందుగానే నివారించే కొన్నిమెడిసిన్లను వాడవచ్చా?

లేదు. వైద్యుడిని సంప్రదించకుండా ఎలాంటి మెడిసిన్లు వాడకపోవడమే ఉత్తమం.

లక్షణాలు వచ్చిన ఎన్ని రోజులకి టెస్ట్ చేసుకోవాలి?

వేచి చూడాల్సిన అవసరమే లేదు. లక్షణాలు కనిపించగానే టెస్ట్ చేసుకోండి.

Flash...   State Educational Achievement Survey (SEAS) 2023 Instructions and practice papers with key

లక్షణాలు కనిపించిన తర్వాత 14రోజులు క్వారంటైన్ లో ఉండాలా? లేదా టెస్ట్ చేసుకున్న తర్వాత 14రోజులు క్వారంటైన్ లో ఉండాలా?

లక్షణాలు పూర్తిగా కనిపించిన వారు 10రోజులు క్వారంటైన్ లో ఉన్నా సరిపోతుంది. లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా 14రోజుల పాటు టెస్ట్ చేసుకున్న తర్వాత నుండి ఉండాల్సి ఉంటుంది.