ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్. ఒక్కసారి వేసుకుంటే చాలు. స్పుత్నిక్ వి ని ఎమర్జెన్సీగా వాడేందుకు ఏప్రిల్ 12న అనుమతి లభించింది. భారత్‌లో కూడా త్వరలో ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి కానుంది.
హైదరాబాద్ ప్రజలకు ఇది నిజంగా శుభవార్తే. రష్యా తయారీ స్పుత్నిక్–వి టీకాల కార్యక్రమం హైదరాబాద్‌లో నగరంలో ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో తొలిడోసును డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మా సంస్థకు చెందిన ఒక ఉద్యోగికి ఈ టీకా వేశారు. మన దేశంలో ప్రస్తుతం స్పుత్నిక్ టీకాలను రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఆ సంస్థతో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం రెడ్డీస్ ల్యాబ్స్ దిగుమతి చేసుకున్న మొదటి బ్యాచ్ 1.50 లక్షల స్పుత్నిక్ డోసులను వేయనున్నామని అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలో మొత్తంగా 10 లక్షల డోసులు రానున్నాయని ఆమె తెలిపారు.
తమ నెట్‌వర్క్ వ్యాప్తంగా టీకా కేంద్రాలను తెరిచి, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రెడ్డీస్ ల్యాబ్స్ బ్రాండెడ్ మార్కెట్స్ సీఈవో ఎంవీ రమణ మాట్లాడుతూ.. తొలి బ్యాచ్ టీకాను హైదరాబాద్, విశాఖలో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, త్వరలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతాలో మొదలుపెడతామని వెల్లడించారు. భారత్‌లో ల్యాండ్ అయిన తొలి విదేశీ కరోనా విరుగుడు వ్యాక్సిన్ ఏదంటే… స్పుత్నిక్ వి అని చెప్పుకోవచ్చు.
ప్రపంచంలో ముందుగా తయారైన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి నే. 2020 మధ్య నుంచి రష్యా ఈ వ్యాక్సిన్ వాడుతోంది. ఈ వ్యాక్సిన్ కరోనా కొత్త వేరియంట్లకు కూడా బాగా పనిచేస్తోందని రష్యా స్పెషలిస్టులు ప్రకటించారు. రష్యా ఈ వ్యాక్సిన్‌ను ఇండియాకి ఏడాదికి 8.5 కోట్ల డోసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇంకా చాలా దేశాలకు దీన్ని ఇస్తోంది. ఇండియాలో రెడ్డీస్ ల్యాబొరేటరీస్… జులై నుంచి ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేపట్టనుంది. ఈ లోగా రష్యా నుంచి వ్యాక్సిన్లు రానున్నాయి.ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్. ఒక్కసారి వేసుకుంటే చాలు. స్పుత్నిక్ వి ని ఎమర్జెన్సీగా వాడేందుకు ఏప్రిల్ 12న అనుమతి లభించింది. ఈ వ్యాక్సిన్‌ను త్వరలో ఇండియాలోనే అత్యధికంగా ఉత్పత్తి చేయనున్నారు.