తప్పిన China Rocket ముప్పు, హిందూ మహాసముద్రంలో కూలిన చైనా రాకెట్ Long March 5B
శకలాలు
చైనా రాకెట్ ఎట్టకేలకు కూలిపోయింది. భూమిపై పడకుండా సముద్ర జలాల్లో కూలడంతో పలు
దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఏప్రిల్ 29న చైనా శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టిన
రాకెట్ ‘లాంగ్ మార్చ్ 5బీ’ కుప్పకూలిన అనంతరం శకలాలు హిందూ మహాసముద్రంలో
పడిపోయాయి.
Rocket Long March 5B : గత కొన్ని రోజులుగా భారత్ సహా మరికొన్ని దేశాలను
భాయందోళనకు గురిచేసిన చైనా రాకెట్ ఎట్టకేలకు కూలిపోయింది. భూమిపై పడకుండా సముద్ర
జలాల్లో కూలడంతో పలు దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఏప్రిల్ 29న చైనా
శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టిన రాకెట్ ‘లాంగ్ మార్చ్ 5బీ’ నేటి ఉదయం కుప్పకూలిన
అనంతరం శకలాలు హిందూ మహాసముద్రంలో పడిపోయాయి.
చైనా మీడియా కథనాల ప్రకారం.. చైనా శాస్త్రవేత్తలు ఏప్రిల్ 29వ తేదీన అంతరిక్ష
కేంద్రం నిర్మాణ పనుల్లో భాగంగా లాంగ్ మార్చ్ 5బి అనే రాకెట్(Long March 5B
Rocket) ప్రయోగించారు. అయితే ఆ రాకెట్ నియంత్రణ కోల్పోయిందని, తమ ప్రయోగం
విఫలమైందని చైనా అధికారిక ప్రకటన చేసింది. 22 టన్నుల పరిమాణం ఉన్న రాకెట్ కూలడం
అంటే మాటలు కాదు. అందులోనూ వేల కిలోమీటర్ల వేగంతో రాకెట్ దూసుకొచ్చి భూమిని
ఢీకొట్టనుందని అంచనా వేశారు.ఈ క్రమంలో అమెరికా సహా పలు దేశాల శాస్త్రవేత్తలు చైనా
రాకెట్‌ను నియంత్రించి సముద్రజలాలలో కూల్చాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
భారత్‌లో సైతం చైనా రాకెట్ కుప్పకూలే అవకాశం ఉందని సైతం అంతర్జాతీయ మీడియాలో
కథనాలు రావడంతో దేశ ప్రజలలో కరోనాతో పాటు రాకెట్ కలవరం మొదలైంది. ఈ క్రమంలో లాంగ్
మార్చ్ 5బి అనే చైనా రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించగానే శకలాలుగా విడిపోయింది.
అనంతరం ఆ శకలాలు మాల్దీవులు సమీపంలోని హిందు మహాసముద్రంలో కూలినట్లు చైనా మీడియా
వెల్లడించింది. ఆదివారం ఉదయం 10 గంటల 20 నిమిషాల ప్రాంతంలో కూలిపోయినట్లు
తెలిపింది. గత ఏడాది సైతం రాకెట్ ప్రయోగం సమయంలో కొంత ప్రమాదం చోటుచేసుకోవడం
తెలిసిందే.